జాన్వీ.. చాలా బిజీ బిజీ!
తరచూ ఇన్‌స్టాలో పోస్టులు పెడుతూ.. యూత్‌ను ఆకట్టుకునే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ మధ్య పోస్టులు చేయడం తగ్గించేసింది. కారణం సినిమాలతో బిజీగా ఉండటమే.
Image: Instagram/Janhvi Kapoor
ఈ బాలీవుడ్ బ్యూటీ ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉంది. మరో సినిమాపై సస్పెన్స్ కొనసాగుతోంది.
Image: Instagram/Janhvi Kapoor
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాతోనే జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది.
Image: Instagram/Janhvi Kapoor
‘దేవర’లో ఈ బ్యూటీ మత్స్యకారిణిగా కనిపిస్తుందని, ఇందులో సైఫ్ అలీ ఖాన్‌కి సవతి కుమార్తెగా నటిస్తోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Image: Instagram/Janhvi Kapoor
మరోవైపు బాలీవుడ్‌లో వరుణ్ ధావన్‌తో కలిసి ‘బవాల్’లో నటించింది. ఈ మధ్యే విదేశాల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దీనికి నితీశ్ తివారీ దర్శకుడు.
Image: Instagram/Janhvi Kapoor
ధర్మ ప్రొడక్షన్‌లో రాజ్‌కుమార్ రావ్, జాన్వీ కలిసి నటిస్తోన్న చిత్రం ‘మిస్టర్ & మిసెస్ మహి’. ఈ సినిమా కూడా చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతోంది.
Image: Instagram/Janhvi Kapoor
ఇప్పుడు జాన్వీ.. ‘ఉలాజ్’ షూటింగ్‌తో బిజీగా ఉంది. ఇందులో ఈమె అటవీ అధికారిణిగా కనిపించబోతోంది. గుల్షన్ దేవయ్య, రోషన్ మాథ్యులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుధాన్షు సరియా దర్శకత్వం వహిస్తున్నారు.
Image: Instagram/Janhvi Kapoor
ఓవైపు ‘దేవర’, మరోవైపు ‘ఉలాజ్’ షూటింగ్స్, ‘బవాల్’, ‘మిస్టర్ & మిసెస్ మహి’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉండటంతో జాన్వీకి తీరిక లేకుండాపోతోంది.
Image: Instagram/Janhvi Kapoor
ఎన్టీఆర్ ‘దేవర’ షూటింగ్ పూర్తి కాకముందే జాన్వీ మరో తెలుగు సినిమాలో నటించనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.
Image: Instagram/Janhvi Kapoor
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో అక్కినేని అఖిల్ చేయనున్న కొత్త సినిమాలో జాన్వీ నటించనున్నట్లు టాక్. దీనిపై ఆ చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటనేమీ రాలేదు.
Image: Instagram/Janhvi Kapoor