రైల్వేశాఖ నిర్వహిస్తోన్న రైలు రెస్టారంట్లను చూశారా!
ప్రయాణికులకు సరికొత్త అనుభూతుల్ని పంచడానికి రైల్వేశాఖ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే గత కొన్నాళ్లుగా రైల్వే స్టేషన్ పరిసరాల్లో రైలు రెస్టారంట్లను ప్రారంభిస్తోంది. Image: Twitter
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు రైల్వేస్టేషన్‌లో అక్టోబర్ 10న కోచ్ రెస్టారంట్‌ను ప్రారంభించింది రైల్వేశాఖ.
Image: Twitter
పసుపు వర్ణపు వెలుగుల్లో రెస్టారంట్ ధగధగ మెరిసిపోతోంది. ప్రయాణికులు ఈ రెస్టారంట్‌లో భోజనం చేసి హాయిగా రైలు ఎక్కేయొచ్చు. Image: Twitter
అంతకుముందు ఏసీ కోచ్‌లతో తొలి రెస్టారంట్‌ను బిహార్‌లోని కటిహర్ రైల్వేస్టేషన్‌లో ఆగస్టు 10న ఏర్పాటు చేశారు.
Image: Twitter
ఈ రెస్టారంట్ 24 గంటలు అందుబాటులో ఉంటూ.. సరసమైన ధరలకే ఆహార పదార్థాలను ఇస్తామని చెబుతోంది.
Image: Twitter
ఈ ఏడాది ఫిబ్రవరిలో మహారాష్ట్రలోని నాగ్‌పూర్ రైల్వే స్టేషన్‌నూ ‘వీల్స్ ఆన్ రెస్టారంట్’ను ప్రారంభించింది.
Image: Twitter
ఒకేసారి 40 మంది కూర్చునే విధంగా కోచ్‌ను అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్‌తో రూపొందించింది. అన్ని రకాల వంటలు 24 గంటలూ లభిస్తాయట.
Image: Twitter
పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసిన రెస్టారంట్‌ను గతేడాది ఆ రాష్ట్ర మంత్రి బాబుల్ సుప్రియో ప్రారంభించారు.
Image: Twitter
ఇందులోనూ రుచికరమైన అన్నీ వంటకాలు అందుబాటులో ఉంటాయి. ధర కూడా తక్కువేనట.
Image: Twitter
గతేడాది అక్టోబర్‌లోనే ముంబయిలోని సీఎస్‌ఎంటీ రైల్వే స్టేషన్ పరిసరాల్లో రెస్టారంట్ ఆన్ వీల్స్‌ను ప్రారంభించింది రైల్వేశాఖ. ఇప్పుడు మరో నాలుగు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనుంది. Image: Twitter