ఫామ్‌లోకి వచ్చిన రియా చక్రవర్తి..
రియా చక్రవర్తి.. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో మార్మోగిన పేరు.
Image: Instagram/Rhea Chakraborty
సుశాంత్ ఆత్మహత్యకు కారణం ఈమెనేనన్న ఆరోపణ ఉంది. డ్రగ్స్ సహా పలు కేసుల్లో విచారణకు హాజరై వార్తల్లో నిలిచింది.
Image: Instagram/Rhea Chakraborty
వివిధ కారణాలతో రెండేళ్లకుపైగా కెమెరాకు దూరంగా ఉన్న ఈ బాలీవుడ్ బ్యూటీ.. ఎంటీవీ ‘రోడీస్ - సీజన్ 19’షోతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Image: Instagram/Rhea Chakraborty
‘రోడీస్’షోలో రియా.. గ్యాంగ్ లీడర్‌గా కనిపించనుంది. కంటెస్టెంట్ల కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయట. ఇదే విషయాన్ని రియా.. సోషల్‌మీడియా వేదికగా వెల్లడించింది.
Image: Instagram/Rhea Chakraborty
రియా.. 1992 జులై 1న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. 2009లో దిల్లీలో ఎంటీవీ వీజేగా కెరీర్ ప్రారంభించి.. ఆ టీవీ ఛానల్ నిర్వహించిన అనేక షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది.
Image: Instagram/Rhea Chakraborty
తొలిసారిగా టాలీవుడ్‌లో ‘తూనీగ.. తూనీగ(2012)’ చిత్రంతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. మరుసటి ఏడాది‘మేరే డాడ్ కి మారుతీ’తో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది.
Image: Instagram/Rhea Chakraborty
‘సోనాలి కేబుల్’, ‘దోబారా..’, ‘బ్యాంక్ చోర్’ తదితర చిత్రాల్లో నటించి బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
Image: Instagram/Rhea Chakraborty
సుశాంత్‌తో రియా పరిచయం డేటింగ్ వరకు వెళ్లింది. తరచూ వీరిద్దరు విహారయాత్రలకు వెళ్లేవారు. 2019 డిసెంబర్ నుంచి ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండటం మొదలుపెట్టారు.
Image: Instagram/Rhea Chakraborty
సుశాంత్.. రియా మధ్య ఏం జరిగిందో తెలియదు.. కానీ, కొన్ని నెలల తర్వాత రియా ఇల్లు వదిలిపెట్టి వెళ్లింది. అలా వెళ్లిన వారంలోపే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు.
Image: Instagram/Rhea Chakraborty
ఆ తర్వాత రియాపై అనేక ఆరోపణలు వచ్చాయి. పోలీసులు, ఈడీ, ఎన్‌సీబీ సంస్థలు రియాను చాలాకాలం పాటు విచారించాయి.
Image: Instagram/Rhea Chakraborty
ప్రస్తుతం రియా తన కెరీర్‌ను తిరిగి కొనసాగించడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే బీటౌన్‌లో బాగా పాపులరైన ‘రోడీస్’షోలో పాల్గొంటోంది.
Image: Instagram/Rhea Chakraborty