మళ్లీ తెరపైకి రిచా పనయ్..
అల్లరి నరేష్ ‘యముడికి మొగుడు’ సినిమాలో యముడి కుమార్తెగా నటించి ఆకట్టుకున్న తార రిచా పనయ్. చాలా కాలం తర్వాత మళ్లీ తెరపై కనిపించనుంది.
image: instagram/richa panai
సాయిరోనక్ హీరోగా దర్శకుడు నీలకంఠ తెరకెక్కిస్తోన్న‘సర్కిల్’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.
image: instagram/richa panai
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో పుట్టిన ఈ సుందరి చదువు మొత్తం దిల్లీలోనే సాగింది. ఆ తర్వాత ఎయిర్‌హోస్టెస్‌గా కొన్నాళ్లు పనిచేసింది.
image: instagram/richa panai
మోడలింగ్, నటనపై ఆసక్తితో రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది. సినీ అవకాశాలు రావడంతో మలయాళంలో ‘వాడమల్లి’తో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది.
image: instagram/richa panai
‘బ్యాంకాక్ సమ్మర్’, ‘యముడికి మొగుడు’, ‘వీడుగోల్డ్ ఎహే’, ‘రక్షక భటుడు’,‘రాగలహరి’ తదితర చిత్రాల్లో నటించింది.
image: instagram/richa panai
అందం, అభినయం ఉన్నా.. ఈ బ్యూటీకి ఇండస్ట్రీలో ఆశించినంత సక్సెస్ దక్కలేదు. 2017లో వచ్చిన ‘క్రాస్‌రోడ్స్’ వెబ్‌సిరీస్‌తో రిచాకి కాస్త గుర్తింపు వచ్చినా అవకాశాలేవీ తలుపుతట్టలేదు.
image: instagram/richa panai
సినిమాలకు దూరంగా ఉన్నా సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు చేరువగానే ఉంటోంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటోలు పోస్టు చేస్తూ ఆకట్టుకుంటోంది.
image: instagram/richa panai
ఐదేళ్ల తర్వాత ‘సర్కిల్’లో కథానాయికగా నటిస్తోంది. జులై 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఈమె కాస్త బోల్డ్‌గా కనిపించనుందట.
image: instagram/richa panai
హిందూ సంప్రదాయ కుటుంబంలో జన్మించిన రిచాకి ఉదయాన్నే గుడికి వెళ్లడం అలవాటు. అక్కడే ఎక్కువ సమయాన్ని గడపడంతో తనకు ప్రశాంతత లభిస్తుందని చెబుతోంది.
image: instagram/richa panai
‘సాధారణంగా బతికేయడం కాదు.. జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ గడపాలి’ అనే పాలసీని పాటిస్తుందట.
image: instagram/richa panai
This browser does not support the video element.
రిచాకి పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. ఏ కాస్త సమయం దొరికినా వాటితో గడుపుతుందట. దీంతో ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయంటోంది.
video: instagram/richa panai