అందాల కిరీటం అందుకున్న ట్రాన్స్‌జెండర్‌..

ట్రాన్స్‌జెండర్‌ మహిళ.. రిక్కీ వాలేరీ కొల్లే చరిత్ర సృష్టించింది. మిస్‌ నెదర్లాండ్స్‌ కిరీటం దక్కించుకున్న తొలి ట్రాన్స్‌ మహిళగా ఘనత సాధించింది. 

Image: Instagram/Rikkie Valerie Kollé

తాజాగా నెదర్లాండ్స్‌లో జరిగిన జాతీయ అందాల పోటీల్లో రిక్కీ విజేతగా నిలిచింది. ఈ పోటీలకు మిస్‌ యూనివర్స్‌ ఆర్'బోనీ గాబ్రియేల్ ప్రత్యేక అతిథిగా పాల్గొంది. 

Image: Instagram/Rikkie Valerie Kollé

అందాల కిరీటం గెలిచిన వెంటనే రిక్కీ.. తన సంతోషాన్ని ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీని గర్వపడేలా చేశానని పేర్కొంది. తనకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపింది.

Image: Instagram/Rikkie Valerie Kollé

తన కమ్యూనిటీ ప్రజలకు ఒక రోల్‌మోడల్‌గా నిలవాలనేదే తన లక్ష్యమని, లింగమార్పిడి క్రమంలో ఇబ్బందులు పడేవారికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.

Image: Instagram/Rikkie Valerie Kollé

మిస్‌ నెదర్లాండ్స్‌గా నిలిచిన ఈ బ్యూటీ వచ్చే మిస్‌ యూనివర్స్‌ అందాల పోటీల్లో ఆ దేశానికి ప్రాతినిథ్యం వహించనుంది. 

Image: Instagram/Rikkie Valerie Kollé

డచ్‌ దేశంలోని బ్రిడా ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల రిక్కీ.. 16 ఏళ్ల వయసులో లింగమార్పిడి చేయించుకొని రిక్‌ నుంచి రిక్కీగా మారింది.

Image: Instagram/Rikkie Valerie Kollé

మోడలింగ్‌లో అడుగుపెట్టి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత నటిగా మారి.. సినిమాల్లో మెరిసింది. 

Image: Instagram/Rikkie Valerie Kollé

పలు అందాల పోటీల్లోనూ పాల్గొని టైటిళ్లు గెలుచుకున్న ఈ ట్రాన్స్‌ బ్యూటీ.. ఇప్పుడు మిస్‌ నెదర్లాండ్స్‌ కిరీటం దక్కించుకుంది.

Image: Instagram/Rikkie Valerie Kollé

రిక్కీ ఈ అందాల పోటీల్లో విజేతగా నిలవడం పట్ల నెట్టింట కొందరు హర్షం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు.

Image: Instagram/Rikkie Valerie Kollé 

ఈ పోటీల న్యాయనిర్ణేతలకు రిక్కీ తప్ప ఇంకెవరూ కనిపించలేదా అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. రిక్కీని ట్రోల్‌ చేస్తున్నారు. 

Image: Instagram/Rikkie Valerie Kollé

రిక్కీ మాత్రం అవేవీ పట్టించుకోకుండా.. తన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు సిద్ధమవుతోంది.

Image: Instagram/Rikkie Valerie Kollé

‘వరల్డ్స్‌ లోన్లీయెస్ట్‌ హౌస్‌’ గురించి తెలుసా?

కళ్ల కింద నల్లటి వలయాలు ఇలా మాయం!

రాష్ట్రానికో ఫేమస్‌ రైస్‌ డిష్‌!

Eenadu.net Home