ఆసీస్‌పై ఫాస్టెస్ట్ 50+..
పంత్ ప్రపంచ రికార్డు
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్ (61) దంచికొట్టాడు. క్రీజులో ఉన్నంతసేపు ధనాధన్ షాట్లతో అభిమానులను అలరించాడు.
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పంత్.. టెస్టు క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా గడ్డపై 30 బంతుల్లోపు అర్ధ శతకం చేసిన తొలి విదేశీ ఆటగాడిగా నిలిచాడు.
ఈ క్రమంలోనే వెస్టిండీస్ మాజీ ఆటగాడు రాయ్ ఫ్రెడెరిక్స్ (33 బంతుల్లో; 1975), ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ జాన్ బ్రౌన్ (33 బంతుల్లో; 1975)ల పేరిట ఉన్న రికార్డును పంత్ బ్రేక్ చేశాడు.
ఆస్ట్రేలియాలో డేవిడ్ వార్నర్ (23 బంతుల్లో, 2017లో పాక్‌పై; సిడ్నీ) తర్వాత అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగానూ పంత్ రికార్డు సృష్టించాడు.
ఈ ఇన్నింగ్స్‌తో టెస్టుల్లో భారత్ తరఫున రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా పంత్ నిలిచాడు. తొలి స్థానంలో కూడా అతనే (28 బంతుల్లో, శ్రీలంకపై 2022) ఉండటం విశేషం.
ఈ సంచలన ఇన్నింగ్స్‌తో టెస్టుల్లో ఎక్కువ స్ట్రైక్‌రేట్ (184.84)తో 50కిపైగా రన్స్ చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు రిషభ్ పంత్.
అంతకుముందు ఈ రికార్డు కపిల్‌దేవ్ పేరిట ఉండేది. ఆయన 1982లో ఇంగ్లాండ్‌పై 161.81 స్ట్రైక్‌రేట్‌తో 55 బంతుల్లో 89 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో వెస్టిండీస్ దిగ్గజం వివి రిచర్డ్స్ సరసన చేరాడు పంత్. టెస్టు క్రికెట్ చరిత్రలో 160పైచిలుకు స్ట్రైక్‌రేట్‌తో రెండు హాఫ్ సెంచరీలు చేసింది వీరిద్దరే.