దుల్కర్‌తో... బాక్సింగ్‌ బ్యూటీ!

‘గురు’తో ప్రేక్షకుల మనసులు దోచేసిన రితికా సింగ్‌.. దుల్కర్‌ సల్మాన్‌ సరసన ఆడిపాడింది. ఆయన హీరోగా నటిస్తోన్న ‘కింగ్‌ ఆఫ్ కోతా’లో వారిద్దరిపై ఓ ప్రత్యేక పాటను చిత్రీకరించినట్లు సమాచారం. 

Image:Instagram/ritika_offl

ఈ భామ.. 2016లో హీరోయిన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ‘సాలా ఖడూస్‌’తో మంచి పేరు సంపాదించుకుంది. ఇదే కథను తెలుగులో ‘గురు’ గా రీమేక్‌ చేశారు.

Image:Instagram/ritika_offl

ఒకే కథ ఇరుధి సుట్రు(తమిళ్‌), సాలా ఖడూస్‌(హిందీ), గురు(తెలుగు)గా తెరకెక్కించగా.. ఆమె నటనకు నేషనల్‌, ఫిల్మ్‌ఫేర్‌, సైమా అవార్డులు దక్కడం విశేషం.

Image:Instagram/ritika_offl

రితికా 1994 డిసెంబరు 16న ముంబయిలో జన్మించింది. 

Image:Instagram/ritika_offl

This browser does not support the video element.

నటిగా గుర్తింపు తెచ్చుకున్న రితికా.. మార్షల్‌ ఆర్ట్స్‌ క్రీడాకారిణి. 2009లో భారత్‌ తరఫున ‘ఆసియా ఇండోర్‌ గేమ్స్‌’, ‘సూపర్‌ ఫైట్‌ లీగ్‌’ పోటీల్లో పాల్గొంది.

Image:Instagram/ritika_offl

This browser does not support the video element.

రితికా.. లారెన్స్‌తో కలిసి ‘శివలింగా’లో నటించింది.

Image:Instagram/ritika_offl

This browser does not support the video element.

ఎక్కువగా తమిళ చిత్రాల్లో నటించే రితికా.. హిందీ, మలయాళ చిత్రాల్లోనూ మెరిసింది.

Image:Instagram/ritika_offl

This browser does not support the video element.

ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. అందుకే, జిమ్‌లో క్రమం తప్పకుండా వర్కౌట్లు చేస్తుంటుంది. తన వర్కౌట్‌ ఫొటోలు, వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. ‘మై ఫేవరెట్ ప్లేస్‌’ అంటూ రాసుకొచ్చింది. 

Image:Instagram/ritika_offl

This browser does not support the video element.

రితికాకు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు డాన్స్‌ చేయడం చాలా ఇష్టమట! ఓ డాన్స్‌ వీడియోను సోషల్‌ మీడియాలో నెటిజన్లతో పంచుకొంది. 

Image:Instagram/ritika_offl

This browser does not support the video element.

ఈ బ్యూటీకి ఇన్‌స్టాలో 3 మిలియన్లు, ఫేస్‌బుక్‌లో 879 వేల మంది, ట్విటర్లో 782.9 వేల మంది ఫాలోవర్లున్నారు. 

Image:Instagram/ritika_offl

8 భాషలు.. 10 వేల స్క్రీన్లు: ‘కంగువా’ విశేషాలివీ!

టాలీవుడ్‌ టీజర్లు.. ఫస్ట్‌డే నంబర్లు..!

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న ప్రభాస్‌

Eenadu.net Home