హైదరాబాదీ.. అందాల సుందరి!

‘టక్‌ జగదీష్‌’, ‘వరుడు కావలెను’తో గతేడాది సందడి చేసిన రీతూ వర్మ ఇటీవల ‘ఒకే ఒక జీవితం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Image:Instagram/Rithu Varma

‘ఒకే ఒక జీవితం’లో శర్వానంద్‌ సరసన రీతూ నటించింది. ఈ సినిమాలో అక్కినేని అమల కీలక పాత్ర పోషించారు.

Image:Instagram/Rithu Varma 

శ్రీ కార్తీక్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబరు 9న విడుదలైంది. అక్టోబర్‌ 20న ఓటీటీలో విడుదలకానుంది.

Image:Instagram/Rithu Varma

హైదరాబాద్‌లో 1990 మార్చి 10న జన్మించిన రీతూ.. మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజీలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసింది.

Image:Instagram/Rithu Varma

గ్రాడ్యుయేషన్‌ తర్వాత మిస్‌ హైదరాబాద్‌ అందాల పోటీలో పాల్గొని మొదటి రన్నరప్‌గా నిలిచింది.

Image:Instagram/Rithu Varma

ఎన్టీఆర్‌, కాజల్‌ జంటగా వచ్చిన ‘బాద్‌ షా’లో పింకీగా తొలిసారి వెండితెరపై మెరిసింది.

Image:Instagram/Rithu Varma

‘పెళ్లి చూపులు’తో రీతూ కెరీర్‌ మలుపు తిరిగింది. ఆ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం వచ్చాయి.

Image:Instagram/Rithu Varma 

‘పెళ్లి చూపులు’లోని నటనకుగాను ఉత్తమ నటిగా ‘నంది అవార్డు’ కూడా అందుకుంది.

Image:Instagram/Rithu Varma 

అమెజాన్‌ ప్రైమ్‌లో ఇటీవల విడుదలైన ‘మోడర్న్‌ లవ్‌ హైదరాబాద్‌’ వెబ్‌ సిరీస్‌లోనూ రీతూ నటించింది.

Image:Instagram/Rithu Varma 

సిరాజ్‌ ‘లైక్డ్‌’ గర్ల్‌ఫ్రెండ్‌!

అలిలా కోటలో ‘రాయల్‌’గా అదితి- సిద్ధార్థ్‌

పారితోషికంలో టాప్‌.. ఏ హీరోనో తెలుసా?

Eenadu.net Home