రితికా అందాల కిక్‌!

‘గురు’తో తెలుగు తెరపై అడుగుపెట్టి ఫుల్‌ క్రేజ్‌ సంపాదించుకున్న రితికా సింగ్‌ రజనీకాంత్‌ ‘వేట్టయన్‌’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

జ్ఞానవేల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబరు 10న విడుదల కానుంది. ‘వేట్టయన్‌’కు రితికా స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకొంది. 

సినిమాలే కాకుండా.. ఇంతకు ముందు ‘స్టోరీ ఆప్ థింగ్స్‌’, తాజాగా ‘బెంచ్‌ లైఫ్‌’ వెబ్‌సిరీస్‌లతోనూ అలరిస్తోంది. ‘బెంచ్‌ లైఫ్‌’ రితికా.. మీనాక్షి పాత్రలో నటించింది. 

ఈమె ప్రొఫెషనల్‌ కిక్‌ బాక్సర్‌. సినిమాల్లోకి వచ్చాక క్రీడకు కాస్త గ్యాప్‌ ఇచ్చినా.. తన ఫిట్‌నెస్‌ కోసం వర్కౌట్స్‌ చేస్తూ ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్టు చేస్తుంటుంది. 

సోదరుడు, తండ్రితో పాటు తరచూ బాక్సింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తూనే ఉంటుంది. ‘నాకు కష్ట సమయంలో తోడుండేది నాన్న, నా తమ్ముడే..’ అంటోంది రితికా. 

బాక్సింగ్‌ చేస్తున్నప్పుడు ఓ ఫైట్‌ లీగ్‌లో రితికాను చూసి సుధా కొంగర తమిళంలో ‘ఇరుధి సుట్రు’కి ఎంపిక చేశారట. ఆ తర్వాత ఆడిషన్‌ను నిర్వహించి ఓకే చేశారు.

సుధా కొంగర ఈ కథను 2011లో రాసుకున్నారట. మొత్తానికి ఈ చిత్రం 4 ఏళ్ల తర్వాత 2016లో విడుదలైంది. తెలుగులో దీనికి రీమేక్‌గా వచ్చిందే వెంకటేశ్‌ ‘గురు’.

సోషల్ మీడియాలో నానమ్మతో కలిసి రితికా చేసే సందడి అంతా ఇంతా కాదు.. తరచూ ఫన్నీ రీల్స్‌తో ఆకట్టుకుంటారు.

ఇన్‌స్టాలో రితికా పోస్టులకు క్షణాల్లో లక్షల లైకులు, కామెంట్లు వస్తుంటాయి. ఈమె ఇన్‌స్టా ఖాతాకు 44లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

ఇండియాలో టాప్‌- 10 ‘గూగుల్డ్‌’ షోస్‌

సెలెనా గోమెజ్‌... పెళ్లి వార్తతో వైరల్‌

లవ్లీ లావెండర్‌... లవ్లీ పోజులు

Eenadu.net Home