మగవాడు అంటేనే పగవాడు అంటోన్న రీతూ..

గతేడాది తమిళంలో ‘మార్క్‌ ఆంటోనీ’తో హిట్‌ కొట్టింది రీతూ వర్మ. ప్రస్తుతం ‘స్వాగ్’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. రాణి మింజామర రుక్మిణి దేవిగా కనిపించనుంది.

హసిత్‌ గోలి దర్శకత్వం వహిస్తున్న ‘స్వాగ్‌’లో శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్నారు. ‘రాజ రాజ చోర’ చిత్రానికి సీక్వెలే ఈ సినిమా. అక్టోబర్‌ 4న విడుదల కానుంది.

‘స్వాగ్‌’లో స్త్రీ పక్షపాతిగా మగవారికి వ్యతిరేకంగా కత్తి దూయనుంది రీతూ. ‘మగవాడంటేనే పగ వాడు.. వాడి ఉనికిని ఉండనిస్తామా..’ అంటూ పవర్‌ఫుల్‌ డైలాగులూ చెబుతోంది. 

సినిమాల్లోనే కాదు.. కిందటి ఏడాది ‘మోడ్రన్‌ లవ్‌ చెన్నై’ వెబ్‌సిరీస్‌లోనూ మల్లికగా కనిపించింది. ఇది తమిళ్‌లో విడుదలైంది.

తమిళంలో విక్రమ్‌ హీరోగా వస్తున్న ‘ధ్రువ నచ్ఛిత్రం’ చాప్టర్‌ వన్‌లో అనుపమగా నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది నవంబర్‌లో రానుంది.

‘వరుడు కావలెను’ తర్వాత రీతూ తెలుగు సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ‘స్వాగ్‌’తో ఆ లోటు తీరనుంది.

సందీప్‌ కిషన్‌ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న మరో చిత్రంలోనూ కథానాయికగా రీతూ వర్మను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. 

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా వచ్చిన ‘కనులు కనులను దోచాయంటే’ చిత్రానికి తమిళ్‌లో బెస్ట్‌ డెబ్యూ యాక్ట్రెస్‌గా అవార్డునూ అందుకుంది. టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ‘పెళ్లి చూపులు’కి కూడా ఉత్తమ నటి టైటిల్‌ గెలుచుకుంది.

హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన రీతూ వర్మ స్వస్థలం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌. మల్లారెడ్డి కాలేజీలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ఆమె మిస్‌ హైదరాబాద్‌ బ్యూటీ కాంపిటీషన్‌లో రన్నరప్‌గా నిలిచింది. 

 2012లో ‘అనుకోకుండా’ అనే షార్ట్‌ఫిల్మ్‌లో నటించింది. దానికి మంచి ఆదరణ లభించింది. 2013 కేన్స్‌లో షార్ట్‌ఫిల్మ్‌ జాబితాలో ఈ చిత్రం నిలిచింది.

ఈమెకి విహారయాత్రలంటే మహా ఇష్టం. ఎక్కువ సమయాన్ని ట్రిప్పుల్లోనే గడిపేస్తుంది. వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ అక్కడి ఆహారాన్ని ఆస్వాదిస్తుంది.

రీతూ చీరకట్టుకి పెద్ద ఫ్యాన్‌. సంప్రదాయంగా చీర, దానిపై నగలను ధరించి తరచూ ఫొటో షూట్లు చేస్తుంటుంది. ఈమె ఇన్‌స్టా ఖాతాకి 22 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. 

ఎప్పుడూ ట్రెండ్‌ని ఫాలో అవుతూ ఉండే ఈ బ్యూటీ.. అనేక బ్రాండ్లకు అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తోంది.

ఈ వారం ఓటీటీ చిత్రాలివే!

వయసు పెరిగినా.. జోరు తగ్గని నాయికలు వీరే!

మిడిల్‌ క్లాస్ మిస్‌ ఇండియా.. మానస

Eenadu.net Home