విజయకేతనం ఎగరేసిన.. రివాబా జడేజా!

గుజరాత్‌ ఎన్నికల్లో క్రికెటర్‌ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా ప్రత్యర్థిపై 61 వేలకు పైగా భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇది అందరి విజయంగా అభివర్ణించారు.

image:instagram/rivabajadeja_official

అహ్మదాబాద్‌లోని నార్త్‌ జామ్‌ నగర్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా రివాబా జడేజాను భాజపా ఎంపిక చేసింది.  

image:instagram/rivabajadeja_official

రివాబా.. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో 1990 సెప్టెంబర్‌ 05న జన్మించారు.

image:instagram/rivabajadeja_official

ఆత్మీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ నుంచి మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో పట్టా పొందారు. 

image:instagram/rivabajadeja_official

2016 లో రవీంద్ర జడేజాను రివాబా వివాహం చేసుకున్నారు. వీరికి ఓ పాప కూడా ఉంది.

image:instagram/rivabajadeja_official

సామాజిక సేవా కార్యకలాపాల్లో ఎప్పుడూ ముందుంటూ ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు రివాబా.

image:instagram/rivabajadeja_official

ప్రముఖ రాజకీయనేత హరి సింగ్‌ సోలంకికి రివాబా దగ్గరి బంధువు. గతంలో కర్ణిసేన నాయకురాలు. మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. 

image:instagram/rivabajadeja_official

రివాబాకు ఇన్‌స్టాలో లక్షకు పైగా ఫాలోవర్లున్నారు. ఎక్కువగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఫొటోలనే పోస్టు చేస్తూ ఉంటారు.

image:instagram/rivabajadeja_official

గత లోక్‌సభ(2019) ఎన్నికల ముందు భాజపాలో చేరారు. తాజాగా గుజరాత్‌ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగి గెలుపొందారు.

image:instagram/rivabajadeja_official

చిత్రం చెప్పే విశేషాలు..!(01-04-2023/2)

చిత్రం చెప్పే విశేషాలు..!01-04-2023/1)

చిత్రం చెప్పే విశేషాలు(31-03-2023/1)

Eenadu.net Home