రోడ్ ట్రిప్‌కి వెళ్తున్నారా? ఇవి చెక్ చేసుకోండి!
ట్రిప్‌కు సిద్ధమయ్యే ముందు కారు/బైక్ సర్వీసింగ్ చేయించి కండిషన్‌లో ఉంచుకోవాలి.
Image:RKC
మీ లైసెన్స్, వాహనానికి సంబంధించిన ఆర్‌సీ ఇతర పత్రాలు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.
Image:RKC
సుదూర ప్రయాణమైతే.. డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్ర రాకుండా ముందుగానే ఎక్కువ సేపు నిద్రిస్తే మంచిది.
Image:RKC
మీరు వెళ్లే ప్రదేశం, అక్కడి వాతావరణానికి తగినట్టుగా దుస్తులు, ఇతర పరికరాలు సిద్ధం చేసుకోండి.
Image:RKC
ప్రయాణాల్లో ఎక్కడెక్కడ బ్రేక్ తీసుకోవాలో ముందుగానే ప్రణాళికలు వేసుకోవాలి. దారి మధ్యలో ఏవైనా సందర్శక ప్రాంతాలుంటే వాటినీ చూసేలా రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకోవాలి.
Image:RKC
దారి మధ్యలో రోడ్డు పక్కన లభించే ఫుడ్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంటి నుంచే పోషకాలతో కూడిన స్నాక్స్ తీసుకెళ్లండి. తాగునీరు కూడా వెంట ఉంచుకోవాలి.
Image:RKC
కచ్చితమైన గమ్యస్థానం మీకు తెలియకపోతే గూగుల్ మ్యాప్‌ను ఆశ్రయించండి. అది మిమ్మల్ని దారితప్పకుండా చూస్తుంది.
Image:RKC
కొంతమందికి ప్రయాణాల్లో వాంతులు అవుతాయి. అలాంటి వారు నిమ్మకాయను వెంట తెచ్చుకోవాలి. వాంతులు వచ్చినట్లయితే దాని వాసన పీల్చాలి. అలాగే, నిద్రమత్తు వదలడానికి చూయింగ్‌గమ్స్ నమలొచ్చు.
Image:RKC
కారులో వెళ్లేవారు నిశ్శబ్దంగా కూర్చోకుండా సరదాగా మాట్లాడుతూ ఉంటే మంచిది. లేదంటే ప్రయాణికులు నిద్రలోకి జారుకుంటారు. దీంతో డ్రైవింగ్ చేసేవారికి నిద్ర ముంచుకొస్తుంది.
Image:RKC
ప్రయాణంలో బోర్ కొట్టకుండా అందరికీ నచ్చే పాటలు, ఆసక్తిని పెంచే ఆడియో బుక్స్ వింటూ ప్రయాణిస్తే దూరమన్నదే తెలియదు.
Image:RKC
మీరు వెళ్లిన చోట, దారి మధ్యలో మీకు ఏవైనా అవసరాలుంటే.. మోహమాటం లేకుండా అక్కడి స్థానికుల సహాయం అడగండి. మీ అత్యవసరం తీరాలంటే తప్పదు మరి.
Image:RKC
మీతోపాటు పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నట్లయితే వారి కోసం కొన్ని ఆటబొమ్మలు, డ్రాయింగ్ బుక్స్ వంటివి వెంట తెచ్చుకోండి. వాటితో పిల్లలకు కాలక్షేపమవుతుంది.
Image:RKC