స్మార్ట్ రింగ్‌లో డిస్‌ప్లే.. అదిరిపోయిందిగా!
స్మార్ట్ వాచ్ తయారీ కంపెనీ రాగ్‌బిడ్ ప్రపంచంలోనే తొలిసారిగా డిస్‌ప్లేతో స్మార్ట్ రింగ్‌ను లాంచ్ చేసింది.
SR08 అల్ట్రా పేరిట తీసుకొచ్చిన ఈ రింగ్ టైటానియం అలాయ్ బాడీతో వస్తోంది. 8 మి.మీ. వెడల్పు, 2.5 మి.మీ. మందం, 4 గ్రాముల బరువు ఉంటుంది.
సాధారణంగా స్మార్ట్ రింగుల్లా కాకుండా ఇందులో OLED డిస్‌ప్లే, టచ్ సెన్సిటివ్ ఇంటర్‌ఫేస్ ఉంటాయి.
స్టెప్ కౌంట్, హార్ట్ రేట్, స్లీప్ ట్రాకింగ్, కేలరీ కౌంట్, వర్కౌట్ డేటాను ఇందులో యాక్సెస్ చేయొచ్చు.
ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటికీ ఈ రింగ్ సపోర్ట్ చేస్తుంది. మల్టీ లాంగ్వేజ్ సపోర్టు కూడా ఉంటుంది. వాటర్‌ప్రూఫ్ రేటింగ్ ఉంది.
బ్యాటరీ లైఫ్ 3 నుంచి 5 రోజుల పాటు ఉంటుంది. ఛార్జింగ్ కేస్ సాయంతో 20 రోజుల పాటు ఉపయోగించుకోవచ్చు.
గోల్డ్, సిల్వర్, బ్లాక్ రంగుల్లో... ఆరు సైజుల్లో ఈ రింగ్ లభిస్తుంది. దీని ధర అంతర్జాతీయ మార్కెట్ 89.99 డాలర్లు.
డిస్‌ప్లేతో వచ్చే ఈ స్మార్ట్ రింగ్‌ను మన దేశంలోకి ఎప్పుడు తీసుకొస్తారు అనేది తెలియాల్సి ఉంది.