రోహిత్‌ టెస్టు కెప్టెన్సీ రికార్డులివే

రోహిత్ నాయకత్వంలో ఇంగ్లాండ్‌ను 4-1 తేడాతో ఓడించి ఐదు టెస్టుల సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. 

112 ఏళ్ల తర్వాత.. ఐదు టెస్టుల సిరీస్‌లో 0-1తో వెనుకబడి తిరిగి పుంజుకొని గెలవడం విశేషం. 

ఇప్పటి వరకు రోహిత్ 16 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 

హిట్‌మ్యాన్‌ కెప్టెన్సీలో 10 టెస్టుల్లో భారత్‌ గెలిచింది. నాలుగింటిలో ఓటమిపాలైంది. మరో రెండింటిని డ్రా చేసుకుంది.

భారత సారథుల్లో అత్యధిక విజయాల శాతం నమోదు చేసిన కెప్టెన్‌ రోహిత్ (62.50 శాతం) రికార్డు సృష్టించాడు. 

విదేశాల్లో రోహిత్ నాయకత్వంలో భారత్ 5 టెస్టులు ఆడింది. రెండింట్లో గెలిచి.. మరో రెండు టెస్టులో ఓడింది. ఒకటి డ్రా అయింది.

ఐదు సిరీసుల్లో కెప్టెన్‌గా ఉండి.. నాలుగింట గెలిచాడు. ఒకటి డ్రాగా ముగిసింది.

ఆసీస్‌తో డబ్ల్యూటీసీ 2023 ఫైనల్‌ మ్యాచ్‌కు కెప్టెన్‌గా రోహిత్ వ్యవహరించాడు. అక్కడ టీమ్‌ఇండియాకు ఓటమి ఎదురైంది.

ధర్మశాల వేదికగా జరిగిన ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టులో గెలవడంతో.. స్వదేశంలో టీమ్‌ఇండియా 400వ విజయం నమోదు చేసుకుంది.

రెండో టీ20.. వరుణ్‌ చక్రవర్తి రికార్డులు

సౌతాఫ్రికాపై సెంచరీతో రికార్డులు సృష్టించిన సంజు

ప్రపంచ వ్యాప్తంగా టాప్‌-10 స్పోర్ట్స్‌ లీగ్స్‌ ఇవే!

Eenadu.net Home