రో‘హిట్‌’ మ్యాన్‌ రికార్డులు ఇవే!

ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ కెప్టెన్ రోహిత్ శర్మ (103) సెంచరీతో మెరిశాడు. ఇది రోహిత్‌ టెస్టు కెరీర్‌లో 12వ సెంచరీ. దీంతోపాటు పలు రికార్డులనూ తన ఖాతాలో వేసుకున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా నిలిచాడు. సచిన్‌ 100, విరాట్ 80, రాహుల్ ద్రవిడ్ 48, రోహిత్ శర్మ 48, వీరేంద్ర సెహ్వాగ్ 38, సౌరభ్‌ గంగూలీ 38 సెంచరీలు సాధించారు. 

ఓపెనర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా హిట్‌మ్యాన్‌ రికార్డులోకెక్కాడు. డేవిడ్ వార్నర్‌ (49), సచిన్‌ (45) తర్వాత రోహిత్ శర్మ (43) ఉన్నాడు.

ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో భారత ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌ రోహిత్. ఇప్పుడీ సెంచరీతో ఆ సంఖ్య 4కి చేరింది. సునీల్‌ గావస్కర్‌ కూడా సరిగ్గా నాలుగు శతకాలు బాదాడు. 

టెస్టుల్లో 2021 నుంచి భారత్‌ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా రోహిత్ నిలిచాడు. మొత్తం 6 సెంచరీలు చేశాడు. ఆ తర్వాత శుభ్‌మన్‌ గిల్ 4 సెంచరీలు సాధించాడు.

30 ఏళ్లు దాటిన తర్వాత.. కెరీర్‌లో అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాటర్‌గా సచిన్‌ రికార్డును రోహిత్ సమం చేశాడు. వీరిద్దరూ 35 శతకాలు చేశారు. ఈ రికార్డు కుమార సంగక్కర (43) పేరిట ఉంది. 

టెస్టుల్లో రోహిత్ ఇప్పటివరకు 84 సిక్స్‌లు బాదాడు. సెహ్వాగ్‌ (90) తర్వాత ఎక్కువ సిక్స్‌లు కొట్టిన రెండో భారత ఆటగాడు అతడే. 

మరో మూడు బాదితే అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లు కలిపి సిక్స్‌ల సంఖ్య 600 మైలురాయిని అందుకొంటుంది.

ఒలింపిక్స్‌ గురించి ఆసక్తికర విషయాలు

శ్రీలంక పర్యటనలో భారత్‌.. ఎప్పుడు ఏ మ్యాచ్‌ అంటే?

టెస్టు క్రికెట్‌లో ఇంగ్లాండ్ ప్రపంచ రికార్డు

Eenadu.net Home