సచిన్‌ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్‌

టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరో రికార్డు బద్దలు కొట్టాడు. అది కూడా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ నెలకొల్పినది కావడం గమనార్హం.

Image:SocialMedia

 ఆసియా కప్‌ చరిత్రలో ఇప్పటివరకు భారత్‌ తరఫున అత్యధిక పరుగులు (971) రికార్డు సచిన్‌ పేరిట ఉండేది. ఇప్పుడది హిట్‌మ్యాన్‌ ఖాతాలోకి చేరింది.

Image:SocialMedia 

శ్రీలంకతో 8న జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ (72) అర్ధ శతకంతో రాణించాడు. ఈ క్రమంలోనే ఆసియా కప్‌లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

Image:SocialMedia 

ఆసియా కప్‌ టాప్‌ స్కోరర్లలో రోహిత్ (1016) కంటే ముందు శ్రీలంక మాజీ క్రికెటర్లు సనత్‌ జయసూర్య (1220), కుమార సంగక్కర (1075) ఉన్నారు.

Image:SocialMedia

శ్రీలంక మ్యాచ్‌లో రోహిత్‌ నాలుగు సిక్స్‌లు బాదడంతో మరో ఘనతను కూడా అందుకున్నాడు.

Image:SocialMedia

ఆసియా కప్‌ చరిత్రలో అత్యధిక సిక్సర్లు (26) కొట్టిన రికార్డు ఇప్పటివరకు పాకిస్థాన్‌ ఆల్‌రౌండర్‌ షాహిది అఫ్రిది పేరిట ఉండేది. దాన్నీ రోహిత్‌ (27) బద్దలు కొట్టాడు.

Image:SocialMedia

శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో నాలుగుసార్లు బంతిని స్టాండ్స్‌లోకి పంపించడం ద్వారా అఫ్రిదిని అధిగమించాడు హిట్‌మ్యాన్‌. Image:SocialMedia

సిక్సర్ల హీరోల జాబితాలో 23 సిక్సర్లతో సనత్‌ జయసూర్య మూడో స్థానంలో, 18 సిక్స్‌లతో ధోనీ, రైనా సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉన్నారు.

Image:SocialMedia

ఒలింపిక్స్‌ గురించి ఆసక్తికర విషయాలు

శ్రీలంక పర్యటనలో భారత్‌.. ఎప్పుడు ఏ మ్యాచ్‌ అంటే?

టెస్టు క్రికెట్‌లో ఇంగ్లాండ్ ప్రపంచ రికార్డు

Eenadu.net Home