రోహిత్‌ శర్మ ఖాతాలో మరో రెండు రికార్డులు..!

టీమ్ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరో రెండు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

Image: Twitter

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు (477) బాదిన రెండో క్రికెటర్‌గా హిట్‌మ్యాన్‌ నిలిచాడు. క్రిస్‌ గేల్‌ (553 సిక్స్‌లు) తొలి స్థానంలో ఉన్నాడు.

Image: Twitter

శనివారం వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో ఈ ఘనత అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ (33; 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. దీంట్లో భారత్‌ విజయం సాధించి 3-1తో సిరీస్‌ను ‌గెల్చుకున్న సంగతి తెలిసిందే.

Image: Twitter

ఈ మ్యాచ్‌లో రోహిత్ మరో అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 16 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఏడో భారత క్రికెటర్‌గా నిలిచాడు.

Image: Twitter

16వేల పరుగుల జాబితాలో రోహిత్‌కు ముందు సచిన్‌, ద్రవిడ్‌, విరాట్ కోహ్లీ, గంగూలీ, ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్‌ ఉన్నారు.

Image: Twitter

ఇక అత్యధిక సిక్సర్ల జాబితాలో ఎవరెవరున్నారంటే..

Image: Twitter

పాక్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిది అఫ్రిది (476 సిక్స్‌లు) మూడో స్థానంలో ఉన్నాడు.

Image: Twitter

398 సిక్స్‌లతో కివీస్ మాజీ బ్యాటర్‌ బ్రెండన్‌ మెక్‌కల్లమ్ నాలుగో స్థానంలో నిలిచాడు.

Image: Twitter

న్యూజిలాండ్‌ ఓపెనర్ మార్టిన్‌ గప్తిల్ 379 సిక్స్‌లతో ఐదో స్థానంలో ఉన్నాడు.

Image: Twitter

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోనీ 359 సిక్సర్లతో ఆరో స్థానంలో ఉన్నాడు.

Image: Twitter

సనత్‌ జయసూర్య (352), మోర్గాన్‌ (346), డివిలియర్స్‌ (328), జోస్‌ బట్లర్‌ (275) సిక్సర్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Image: Twitter

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

IPL వేలం: గతేడాది స్టార్క్‌.. అంతకుముందు ఎవరంటే?

Eenadu.net Home