రోల్స్‌రాయిస్‌ తొలి లగ్జరీ ఈవీ

బ్రిటన్‌కు చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ రోల్స్‌ రాయిస్‌ జనవరి 19న తన తొలి విద్యుత్‌ కారు స్పెక్టార్‌ను ఆవిష్కరించింది.

ఈ విద్యుత్‌ కారు ధర రూ.7.5 కోట్ల (ఎక్స్‌షోరూమ్‌) నుంచి ప్రారంభమవుతుంది.

ఇందులో 102 kWh బ్యాటరీ ఇచ్చారు. సింగిల్‌ ఛార్జితో 530 కిలోమీటర్లకు పైగా ప్రయాణించవచ్చు.

195kW DC ఫాస్ట్‌ ఛార్జర్‌తో 34 నిమిషాల్లోనే 10-80శాతం ఛార్జింగ్‌ అవుతుంది. అదే 50 kW DC ఫాస్ట్‌ ఛార్జర్‌తో అయితే 95 నిమిషాలు పడుతుంది.

ఇందులోని మోటార్‌ 576 bhp శక్తిని, 900 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ స్పెక్టార్‌ 4.5 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

ఇది యాక్టివ్ సస్పెన్షన్, ఫోర్ వీల్ స్టీరింగ్‌ కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది.

రోల్స్‌ రాయిస్‌కు దేశంలో హైదరాబాద్‌, దిల్లీ, చెన్నైలలో మాత్రమే విక్రయశాలలున్నాయి.

ఆర్డర్‌ చేశాక డెలివరీ పొందేందుకు 6-8 నెలల సమయం పడుతుంది.

యూపీఐలో ఈ ఏడాది వచ్చిన మార్పులు

వాట్సప్‌ ఈ ఏడాది బెస్ట్‌ ఫీచర్లు ఇవీ..

స్కామర్ల కామన్‌ డైలాగ్స్‌ ఇవీ!

Eenadu.net Home