రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బేర్‌ 650 విశేషాలివీ..

బైక్‌ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బేర్‌ 650 మోటార్‌ సైకిల్‌ను రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నవంబర్‌ 5న లాంచ్‌ చేసింది.

దీని ధర రూ.3.39 లక్షల (ఎక్స్‌ షోరూమ్‌, చెన్నై) నుంచి ప్రారంభమవుతుంది.

బేర్‌ 650లో ముందువైపు 19 అంగుళాల స్పోక్డ్‌ వీల్స్‌, వెనుకవైపు 17 అంగుళాల వీల్స్‌తో రానుంది.

ముందువైపు 320ఎంఎం డిస్క్‌, వెనుకవైపు 270ఎంఎం డిస్క్‌ బ్రేకులు ఇచ్చారు. 

బేర్‌ 650 బరువు 216 కిలోలు. 6 స్పీడ్‌ గేర్‌ బాక్స్‌తో వస్తోంది.

648 సీసీ ప్యారలల్‌ ట్విన్‌ ఎయిర్‌, ఆయిల్‌ కూల్డ్‌ ఇంజిన్‌ అమర్చారు. 7,150 ఆర్‌పీఎం వద్ద 47 హెచ్‌పీ పవర్‌ను, 56.6Nm పీక్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

డ్యూయల్‌ ఛానల్‌ ఏబీఎస్‌, ఎల్‌ఈడీ లైటింగ్‌, టీఎఫ్‌టీ డిస్‌ప్లే, టైప్‌- సి ఛార్జింగ్‌ పోర్ట్‌ వంటి సదుపాయాలతో వస్తోంది.

ఈ బైక్‌ వైల్డ్‌ హనీ, పెట్రోల్‌ గ్రీన్‌, గోల్డెన్‌ షాడో, బ్రాడ్‌వాక్‌ వైట్‌, టూ ఫోర్‌ నైన్‌ రంగుల్లో లభిస్తుంది. 

నవంబర్‌ 10 నుంచి బుకింగ్స్‌, టెస్ట్‌ రైడ్లు ప్రారంభం కానున్నాయి. నవంబర్‌ నెలాఖరు నుంచి డెలివరీలు మొదలుకానున్నాయి.

సంపదలో ఎలాంటి దశలున్నాయో చూసేయండి

చిన్న ఖర్చులే కదా అనుకోవద్దు.. పొదుపు చేయండి!

ఏ దేశం దగ్గర ఎంత బంగారం?

Eenadu.net Home