ఎన్టీఆర్‌ సరసన రుక్మిణీ వసంత్‌..!

‘సప్తసాగరాలు దాటి సైడ్‌- ఎ, బి’తో అలరించిన రుక్మిణీ వసంత్‌ ఎన్టీఆర్‌ సరసన తెలుగులో ఎంట్రీ ఇవ్వనుందా..? ఇప్పుడు ఇదే సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ న్యూస్‌. 

#ఎన్టీఆర్‌31కు ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్‌ను ఎంపిక చేసినట్లు జోరుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి.

ఇది కాకుండా రవి కిరణ్‌ కోలా దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండకు జోడీగా నటించనుందని వార్తలు వస్తోన్నాయి. తమిళంలో ఇదే ఏడాది విజయ్‌ సేతుపతి, శివకార్తికేయన్‌ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

2019లో ‘బీర్బల్‌ కేస్‌1’తో కన్నడ తెరపై ఎంట్రీ ఇచ్చింది. అదే ఏడాది ‘అప్‌స్టార్స్‌’తో బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది.

రుక్మిణి ‘సప్త సాగరాలు దాటి..’లో ప్రియా పాత్రలో నటించింది. ఇందులో ఈమె నటనకు మంచి గుర్తింపు దక్కింది. సైమాలో ఉత్తమ నటిగా (క్రిటిక్స్‌) అవార్డునూ అందుకుంది. 

రంగస్థలంపై ఎన్నో నాటికలు ప్రదర్శించిన ఆమె నటన మీద ఆసక్తితో చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేసింది.

లండన్‌లోని రాయల్‌ అకాడమీ ఆఫ్‌ డ్రమాటిక్‌ ఆర్ట్స్‌ కాలేజీ నుంచి నటనలో డిగ్రీని పూర్తి చేసింది.

డ్యాన్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. ఖాళీగా ఉన్న సమయంలో ఏం చేస్తావ్‌ అంటే.. ‘నాకు నచ్చేవి రెండే రెండు.. ఒకటి డ్యాన్స్‌, రెండు ట్రావెలింగ్‌’ అంటోంది.

రుక్మిణికి ఐస్‌క్రీమ్‌ అంటే మహా ఇష్టం. ‘కోన్‌ ఆర్‌ కప్‌.. ఆ తేడా ఏం లేదు. రెండూ లాగించేస్తాను’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతుంటుంది.

గ్యాప్‌ తీసుకోలా.. వచ్చింది!

వైట్‌ శారీ.. క్యూటీస్‌!

డిజర్ట్‌ లేనిదే పూట గడవదు

Eenadu.net Home