‘క’ హీరోతో లండన్‌ భామ

2017లో ‘కృష్ణార్జున యుద్ధం’తో తెలుగు తెరకు పరిచయమైంది రుక్సార్‌ థిల్లాన్‌. త్వరలో ‘దిల్‌ రూబా’తో మరోసారి ప్రేక్షకుల్ని పలకరించనుంది.

కిరణ్‌ అబ్బవరం హీరోగా, రుక్సార్‌ హీరోయిన్‌గా, విశ్వకరుణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది. 

లండన్‌లో ఈలింగ్‌లో పుట్టిన రుక్సార్‌ గోవాలో పెరిగింది. అక్కడే పాఠశాల విద్యను, పూర్తి చేసింది. బెంగళూరులో ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో డిగ్రీ చేసింది.

సినిమాల్లోకి రాకముందు మోడల్‌గా చేసిన ఈమె 2012 లో ‘మాక్స్ మిస్‌ బెంగళూరు’లో రెండో రన్నరప్‌గా నిలిచింది.

2016లో కన్నడ చిత్రం ‘రన్‌ ఆంటోనీ’తో వెండితెరపై తొలిసారి కనిపించిన రుక్సార్‌ ‘భాంగ్రా పా లే’తో బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. ‘తుఫాంగ్‌’తో పంజాబీలోనూ మెరిసింది.

‘కృష్ణార్జున యుద్ధం’, ‘ఏబీసీడీ’, ‘అశోకవనంలో అర్జున కల్యాణం’, ‘స్పార్క్‌: లైఫ్‌’, ‘నా సామి రంగ’ వంటి సినిమాల్లో నటించి సందడి చేసింది.

‘పండగలప్పుడు కుటుంబ సభ్యులతో గడపడం, వాళ్లకి స్వయంగా వండి, వడ్డించడం’ అంటే ఇష్టం అంటోంది రుక్సార్‌.

‘నేను ఛాయ్‌ లవర్‌ని.. అల్లం టీ లేనిదే రోజు మొదలవ్వదు. ఇంట్లో ఉంటే పొద్దున్నే ఒక ఛాయ్‌ పడాల్సిందే’ అంటోంది.

తరచూ గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ.. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రుక్సార్‌ తొమ్మిది లక్షలమంది ఫాలోవర్లను సంపాదించుకుంది.

సాహసాలను ఇష్టపడే రుక్సార్‌ ఖాళీ సమయాల్లో స్కూబా డైవింగ్‌ చేస్తూ సముద్ర అందాలను ఆస్వాదిస్తుంది.

‘జుగాడిస్థాన్‌’ అనే హిందీ వెబ్‌సిరీస్‌లో నటించింది.

‘కనుసైగలతోనే వలచింది..’ ఈమెనే!

మోడలింగ్‌ కోసం డిగ్రీ వదిలేశా

కన్నప్ప లుక్స్‌ చూశారా..!

Eenadu.net Home