ఇల్లు కొంటున్నారా? 5/20/30/50 రూల్‌ తెలుసా!

సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. అందుకే, చాలా మంది బ్యాంకుల్లో గృహరుణం తీసుకొని ఇల్లు కొంటుంటారు. అలా మీరూ కొనాలని భావిస్తే.. తప్పకుండా ఈ 5/20/30/50 రూల్‌ని పాటించండి. అసలు ఈ రూల్‌ ఏంటంటే...

Image: Eenadu

స్థాయికి మించి ధర పెట్టి ఇల్లు కొనాలని చూడొద్దు. మీరు కొనదల్చుకున్న ఇంటి ధర మీ వార్షిక ఆదాయానికి ‘5’ రెట్లు మించకుండా చూసుకోవాలి.

Image: Unsplash

సాధారణంగా గృహరుణం ఈఎంఐ కాల వ్యవధి 30 ఏళ్ల వరకు ఉంటుంది. కానీ, ‘20’ ఏళ్లలోపే రుణ మొత్తం చెల్లించగలగాలి.

Image: Unsplash

గృహరుణం నెలవారీ ఈఎంఐ మీ ఆదాయంలో ‘30’శాతం కంటే ఎక్కువగా ఉండకూడదు.

Image: Unsplash

గృహరుణంతోపాటు వ్యక్తిగత, వాహన రుణాలుంటే.. ఆ మొత్తం ఈఎంఐలు మీ ఆదాయంలో ‘50’శాతానికి మించకూడదు.

Image: Unsplash

ఈ రూల్‌ను పాటిస్తూ మీరు ఇల్లు కొనుగోలు చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉంటాయి.

Image: Eenadu

వీలైనంత వరకు ఇంటి కొనుగోలుకు పొదుపు చేసుకున్న డబ్బునే వినియోగించాలి. దీని వల్ల గృహరుణ కాల వ్యవధి, ఈఎంఐ భారం తగ్గుతుంది.

Image: Eenadu

మరో విషయం.. తొలిసారి ఇల్లు కొనుగోలు చేసే వారికి కేంద్రం చేయూతనిస్తోంది. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన(అర్బన్‌) పథకం కింద గృహరుణంపై చెల్లించే వడ్డీలో కొంత మొత్తాన్ని సబ్సిడీ రూపంలో అందిస్తుంది.

Image: Eenadu

పన్ను ఆదా హడావుడిలో ఈ తప్పులొద్దు..

ఏ స్కూటర్‌ రేంజ్‌ ఎంత?

టైటన్‌ ఎస్‌బీఐ కార్డ్‌.. ప్రయోజనాలివే..

Eenadu.net Home