ఆన్‌లైన్‌ షాపింగా? ఈ జాగ్రత్తలు పాటించండి!

ప్రముఖ, నమ్మదగిన వెబ్‌సైట్లలో మాత్రమే షాపింగ్‌ చేయండి.

Source: Pixabay

ఆఫర్స్‌ ఉన్నాయంటూ కనిపించే నకిలీ వెబ్‌సైట్ల జోలికి వెళ్లొద్దు.

Source: Pixabay

ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌కు సంబంధించిన లాగిన్‌ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు.

Source: Pixabay

మీ వ్యక్తిగత వివరాల్లో వెబ్‌సైట్‌కు అవసరమైనవే(పేరు, చిరునామా, మొబైల్‌ నంబర్‌) తప్ప మరే వివరాలు నమోదు చేయొద్దు.

Source: Pixabay

ఒక వెబ్‌సైట్‌లో వస్తువును కొనుగోలు చేసే ముందు.. ఇతర వెబ్‌సైట్లలో, బయట దుకాణాల్లో వాటి ధర ఎంత ఉందో తెలుసుకోవాలి.

Source: Pixabay

ఆన్‌లైన్‌లో కొన్ని వస్తువులకు లేదా నిర్దేశించిన మొత్తం బిల్లుకు మాత్రమే ఉచిత డెలివరీ సదుపాయం ఉంటుంది. లేదంటే డెలివరీ ఛార్జీలు ఉంటాయి. వాటిని పరిశీలించాలి.

Source: Pixabay

ఆఫర్ల విషయంలో అవగాహన ఉండాలి. కొన్ని సార్లు ఉన్న ధరను పెంచి.. తగ్గించినట్లు చూపిస్తారు. కాబట్టి, ఆఫర్ కింద వాస్తవ ధరను తగ్గిస్తేనే కొనుగోలు చేయాలి.

Source: Pixabay

కొన్ని వస్తువులకు మాత్రమే రిటర్న్‌ పాలసీ ఉంటుంది. మీరు కొనే వస్తువుకు అది ఉందో లేదో చెక్‌ చేయాలి. లేదంటే కొన్న వస్తువు నచ్చకపోతే నష్టపోవాల్సి వస్తుంది.

Source: Pixabay

డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా బిల్లు చెల్లింపులు జరిపితే వాటికి సంబంధించిన లావాదేవీలను వెంటనే సరిచూసుకోవాలి.

Source: Pixabay

యూపీఐలో ఈ ఏడాది వచ్చిన మార్పులు

వాట్సప్‌ ఈ ఏడాది బెస్ట్‌ ఫీచర్లు ఇవీ..

స్కామర్ల కామన్‌ డైలాగ్స్‌ ఇవీ!

Eenadu.net Home