సోషల్‌ మీడియాలో సాయిపల్లవి సందడి

సాయిపల్లవి.. గత కొన్ని నెలలుగా ఈ పేరు సోషల్‌ మీడియాలో మారుమోగుతోంది. కారణం ఆమె తెలుగు సినిమాలు అంగీకరించకపోవడమే. అయితే ఇప్పుడు కూడా ఆమె పేరు ఫుల్‌ సౌండ్‌లో వినిపిస్తోంది. కారణం ఆమె వివిధ కారణాలతో వార్తల్లో నిలవడమే. 

గత కొన్ని నెలలుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న సాయిపల్లవి మళ్లీ ఓ తెలుగు సినిమా ఓకే చేసింది. నాగాచైతన్య - చందూ మొండేటి సినిమాలో ఆమెనే కథానాయిక. 

‘లవ్‌స్టోరి’తో ఇప్పటికే ఓసారి జట్టు కట్టిన సాయిపల్లవి - చైతన్య ఇప్పుడు రెండోసారి నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘తండేలు’ అనే పేరు పరిశీలిస్తున్నారని సమాచారం. 

This browser does not support the video element.

ఇక్కడ సినిమాలు ఓకే చేయకపోయినా... తమిళంలో శివకార్తికేయన్‌తో ఓ సినిమా చేస్తోంది. కమల్‌ హాసన్‌ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమా యుద్ధ నేపథ్యంలో చిత్రీకరిస్తున్నారట.

మరోవైపు సాయి పల్లవి బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టనుందనే రూమర్స్‌ చక్కర్లు కొడుతున్నాయి. ఆమిర్‌ ఖాన్‌ కుమారుడు జునైద్‌ ఖాన్‌ సరసన ఓ సినిమాలో నటిస్తోందని టాక్‌. 

సాయిపల్లవి ఇటీవల వదులుకున్న సినిమాల్లో ‘చంద్రముఖి 2’ కూడా ఉంది అంటున్నారు. చంద్రముఖి పాత్ర వస్తే ఆమె నో అనడంతోనే కంగనా రనౌత్‌ సినిమాలోకి వచ్చిందని భోగట్టా. 

సినిమాలే కాదు.. సినిమా షూటింగ్‌లో తీసిన ఓ ఫొటోతో కూడా సాయిపల్లవి వార్తల్లో నిలిచింది. శివకార్తికేయన్‌ సినిమా దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియస్వామి పక్కన సాయిపల్లవి నిల్చున్న ఓ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. 

సినిమా టీమ్‌ తీసుకున్న గ్రూపు ఫొటోలో ఓ భాగమే ఆ ఫొటో అని సమాచారం. ఆ ఫొటోలో రాజ్‌కుమార్‌, సాయిపల్లవి దండలు వేసుకొని ఉండటంతో పెళ్లి అయిపోయింది అనే రూమర్స్‌ మొదలయ్యాయి. 

ఇక సాయిపల్లవి సోషల్‌ మీడియా చూస్తే... విహారయాత్రల ఫొటోలు ఎక్కువగా కనిపిస్తాయి. ఖాళీ సమయాల్లో ఫ్యామిలీ ట్రిప్‌లకే ఆమె ఓటు. 

This browser does not support the video element.

అలా కుటుంబంతో కలసి ఇటీవల కేధార్‌నాథ్‌ వెళ్లింది. అన్నట్లు సాయిపల్లవి ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌ 78 లక్షల ప్లస్సూ...

వింటర్‌ ట్రెండ్స్‌ చూశారా..?

ఏ ట్రైలర్‌ని ఎంత మంది చూశారో..?

తెలుగు హీరో.. మలయాళీ విలన్‌!

Eenadu.net Home