సయీ.. ట్రెడిషనల్ సతి
‘మేజర్’తో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన సయీ మంజ్రేకర్ నిఖిల్ సరసన ‘ఇండియా హౌస్’లో నటిస్తోంది.
1905 నేపథ్యంలో రానున్న ఈ పీరియాడిక్ డ్రామా చిత్రమిది. ఇందులో సతి అనే పాత్రలో ట్రెడిషనల్ లుక్‌లో కనిపించనుంది.
టాలీవుడ్‌లో ‘స్కంద’, ‘గని’, ‘మేజర్’, బాలీవుడ్‌లో ‘దబంగ్ 3’, ‘కుచ్ కట్టా హో జాయ్’, ‘ఔరన్ మే ఖహా దమ్ తా’తో అలరించింది.
2001లో మహారాష్ట్రలో పుట్టింది. ధీరూభాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంది. ముంబయి యూనివర్శిటీలో డిగ్రీ పూర్తి చేసింది.
తండ్రి మహేశ్ మంజ్రేకర్ నటుడు, దర్శకుడు. తల్లి మేధ నిర్మాత. దీంతో చిన్నప్పట్నుంచే సయీకి నటి అవ్వాలనే కోరిక ఉండేదట.
మోడలింగ్‌తో కెరీర్‌ను మొదలుపెట్టిన ఈమె.. ‘కాక్స్‌పర్స్’ అనే మరాఠీ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
పావ్‌బాజీ, బొబ్బట్లు అంటే సయీకి ఇష్టం. ‘ఓ సినిమాలో నటించడం కోసం దాదాపు 30 కేజీలు తగ్గాను. దాంతో జంక్ ఫుడ్ తినడం మానేశాను’ అని చెప్పింది.
సల్మాన్ ఖాన్, నయనతార, ఆలియా భట్ అంటే ఇష్టం. ఖాళీ దొరికితే స్విమ్మింగ్, యోగా చేస్తుంది.
మంచు ప్రాంతాలంటే ఇష్టం. కశ్మీర్, మనాలి, సిమ్లా వంటి ప్రదేశాలకు ఎక్కువగా వెళ్తుంది.
ఫిట్‌గా ఉండేందుకు కఠిన వ్యాయామాలు చేస్తుంది. షూటింగ్ నుంచి విరామం దొరికినప్పుడల్లా గుర్రపు స్వారీ చేస్తుంది.