‘మోగ్లీ’తో మరాఠీ భామ.. తెలుగులో ఎంట్రీ
రోషన్ కనకాల హీరోగా రూపొందుతున్న ‘మోగ్లీ 2025’తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది సాక్షి సాగర్ మదోల్కర్.
సాక్షి 2004లో మహారాష్ట్రలో పుట్టింది. ముంబయిలో ఆర్ట్స్, కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది.
సాక్షి తండ్రి డ్యాన్స్ కొరియోగ్రాఫర్. వీరికి ఇంటర్నేషనల్ డ్యాన్స్ అకాడమీ ఉంది. దీంతో చిన్నప్పట్నుంచే నటన మీద ఆసక్తి పెంచుకుంది.
మోడలింగ్ ద్వారా కెరీర్‌ను ప్రారంభించింది. ప్రకటనల ద్వారా పరిశ్రమలో అడుగు పెట్టింది సాక్షి.
2021లో ‘లైఫ్ ఆఫ్ ఫైవ్’తో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. తెరపై కనిపించింది ‘జహాన్ చార్ యార్’ అనే చిత్రంతోనే.
ఈ ఏడాది ‘నమకుల్’ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘3 మంకీస్’లో నటిస్తోంది.
షూటింగ్ లేకపోతే ఫ్రెండ్స్‌తో అవుటింగ్‌కు వెళ్లి అడ్వెంచర్లతో ఎంజాయ్ చేస్తుంటుంది.
డ్యాన్స్ అంటే ఇష్టం. క్లాసికల్, వెస్ట్రన్‌లో ఫుల్ గ్రేస్‌తో డ్యాన్స్ చేస్తుంది. స్టేజీ ప్రదర్శనలూ ఇస్తుంది.
ఈమె నటి మాత్రమే కాదు సింగర్ కూడా.. తన సినిమాలో ఓ పాట పాడింది. సొంతంగా డబ్బింగ్ చెప్పుకొంటుంది.
ఫిట్‌నెస్ కోసం స్విమ్మింగ్, యోగాతో పాటు బాక్సింగ్ కూడా చేస్తుంది.