హిట్లు లేవు.. ఛాన్స్‌లు చాలా ఉన్నాయ్‌

చేసినవి రెండు సినిమాలు.. రెండూ ఫ్లాప్‌లే. కానీ సాక్షి వైద్యకు ఛాన్స్‌లు ఆగడం లేదు. తాజాగా శర్వానంద్‌ కొత్త సినిమాలో ఆమెను నాయికగా తీసుకున్నారు.

అఖిల్‌ సరసన ‘ఏజెంట్’తో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ చిత్రం విజయాన్ని అందుకోలేకపోయినా.. ఈ బ్యూటీకి అవకాశాలు దక్కుతున్నాయి. 

ఇటీవల ‘గాంఢీవదారి అర్జున’లో వరుణ్‌ తేజ్‌ సరసన అలరించింది. ఇప్పుడు శర్వానంద్‌ కొత్త సినిమాలో నటిస్తోంది. 

‘హాల్‌’ అనే మలయాళ ప్రేమకథలోనూ సాక్షి నటిస్తోంది. ప్రశాంత్‌ విజయ్‌ కుమార్‌ దర్మకుడు. 

మహారాష్ట్రలోని తానేలో పుట్టిన సాక్షి చదువంతా అక్కడే సాగింది. మెడికల్‌ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది.

చదువు పూర్తయ్యాక విఠల్‌ రావు వికీ పాటిల్‌ ఫౌండేషన్‌లో కొద్ది రోజులు ఇంటర్న్‌షిప్‌ చేసింది. అయితే డాక్టర్‌ అవ్వాలనేది ఆమె చిన్ననాటి కల.

This browser does not support the video element.

చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడతానని కలలోనూ ఊహించలేదు. లాక్‌డౌన్‌లో ఇన్‌స్టా రీల్స్‌ చేసేదాన్ని. అవే సినిమా అవకాశాలు తెచ్చిపెట్టాయి అంది సాక్షి.

తొలుత మోడలింగ్‌లో అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత తెలుగులో ‘ఏజెంట్‌’లో ఛాన్స్‌ దక్కింది. అప్పటి నుంచి నటనను సీరియస్‌గా తీసుకుంది.

This browser does not support the video element.

డ్యాన్స్‌ చేయడం అంటే ఇష్టం. ఖాళీ సమయం దొరికితే ఫ్రెండ్స్‌తో డ్యాన్స్‌, రీల్స్‌ చేసి ఆ వీడియోలను ఇన్‌స్టాలో పంచుకుంటుంది.  

‘ఫిట్‌గా ఉండాలంటే జిమ్‌ తప్పదు మరి. ఇదే నా ఫెవరెట్‌ స్పాట్‌’ అని జిమ్‌లో తీసుకున్న వీడియోలు, ఫొటోలను షేర్‌ చేస్తుంటుంది.

This browser does not support the video element.

‘చీర.. ప్రశాంతంగా కనిపించే ఓ కళ. చీరని ఎవరు ఎలా కట్టుకున్నా అందంగానే కనిపిస్తారు. నాకెందుకో తెలియదు

శారీనే సౌకర్యంగా అనిపిస్తుంది’ అని అంటోంది సాక్షి.

హోం వర్క్‌ చేసి.. ‘బడ్డీ’లోకి..

రెబల్‌స్టార్‌ ‘ఇన్‌స్టా’ సంగతులు

కల్కి.. కొందరి ఎంట్రీ.. మరికొందరి రీ ఎంట్రీ

Eenadu.net Home