ఉప్పుతో జాగ్రత్త!

ఉప్పు లేనిదే వంటకి రుచి రాదు. కానీ, ఆ ఉప్పే కొన్నిసార్లు మనిషికి ముప్పును తీసుకొస్తుంది.

Image: Pixabay

అతిగా ఉప్పు తీసుకుంటే అది రక్తపోటును పెంచుతుంది. దీని వల్ల హృద్రోగ సమస్యలు, పక్షవాతం వచ్చే అవకాశాలున్నాయి.

Image: Pixabay

ఉప్పును ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. మరి అందుకు ఏం చేయాలంటే..

Image: Pixabay

కూరల్లో ఉప్పు తక్కువగా వేయడం అలవాటు చేసుకోవాలి. ఆ రుచికే అలవాటు పడాలి.

Image: Pixabay

ఉప్పు వేసి నిల్వ చేసే పచ్చళ్లు, వడియాలు వంటివి తినడం తగ్గించాలి.

Image: Pixabay

బయట ప్యాకెట్లలో లభించే చిరుతిళ్లలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి.

Image: Pixabay

భోజనం చేసే సమయంలో దగ్గర్లో ఉప్పు లేకుండా చూసుకోవాలి. పెరుగు, మజ్జిగలో ఉప్పు కలుపుకోవడం మానేయాలి.

Image: Pixabay

రుచి కోసం ఉప్పు బదులు, వెల్లుల్లి, అల్లం, నిమ్మరసం, వెనిగర్‌ వంటివి కలుపుకోవాలి.

Image: Pixabay

వంటల్లో అయోడిన్‌ కలిపిన ఉప్పును వాడితే ఆరోగ్యానికి మంచిది.

Image: Pixabay

తీపి తినాలన్న కోరిక ఇందుకేనట..!

డీ హైడ్రేషన్‌ను నివారిద్దాం..

పరగడుపున టీ తాగితే ఈ సమస్యలు తప్పవు!

Eenadu.net Home