వీటిలో ఏ ఒక్కటి చేసినా లైఫ్ మారిపోతుంది..
అనారోగ్యం నుంచి కోలుకొని షూటింగ్స్‌లో పాల్గొంటూ బిజీగా మారింది నటి సమంత.. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ఉదయం లేవగానే తాను చేసే పనుల గురించి వివరించింది. అవేంటంటే..
ఉదయాన్నే లేవడం ఆరోగ్యానికి మంచిది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అందుకే, సమంత కూడా ఉదయం 5.30 గంటలకే నిద్రలేస్తుంది.
నిద్రలేవడంతోనే డైరీ రాస్తుంది. ఈ రోజు అంతా బాగుండాలని కోరుకుంటూ.. సానుకూల సందేశాలను రాస్తుందట.
ఆ తర్వాత 5 నిమిషాలపాటు ఎండలో నిల్చుంటుంది. ఉదయపు సూర్యకాంతిలో నిల్చోవడం వల్ల శరీరానికి డి విటమిన్ లభిస్తుంది.
ఆ వెంటనే కాసేపు శ్వాస సంబంధిత వ్యాయామాలు చేస్తుంది. తను ముఖ్యంగా విమ్‌హాఫ్ పద్ధతిని పాటిస్తున్నట్లు వెల్లడించింది.
అనంతరం 25 నిమిషాలు ధ్యానం చేస్తుంది. నిజానికి ఎవరికి ఎంత వయసుంటుందో అన్ని నిమిషాలు ధ్యానం చేయడం మంచిది.
ధ్యానంలో తను ఇషా క్రియను పాటిస్తుంది. ఈ ధ్యాన పద్ధతి తనలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిందని తెలిపింది.
కాసేపు ముఖంపై ట్యాపింగ్(వేళ్లతో ముఖాన్ని నొక్కడం) చేస్తుందట. ఇది శక్తిని సమన్వయం చేయడంతోపాటు నొప్పుల నుంచి ఉపశమనం కల్పిస్తుంది.
వీటిలో ఏ ఒకటో, రెండో పనులు రోజూ చేయడం మొదలుపెట్టినా.. మనలో చాలా మార్పులను గమనించొచ్చు అని సమంత చెబుతోంది.
Images: Instgram/Samantha