సమంత.. ది బిజినెస్ విమెన్
చాలా మంది సినీతారలు నటనతోపాటు వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు. టాలీవుడ్ స్టార్‌హీరోయిన్ సమంత కూడా పలు వ్యాపారాలు ప్రారంభించింది. మరికొన్నింట్లో పెట్టుబడులు పెట్టింది.. అవేంటో చూద్దామా...
కొన్నేళ్ల కిందటే సమంత ‘సాకి’ పేరుతో దుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించింది. ఆ బ్రాండ్ దుస్తులు ఆన్‌లైన్‌లో, దుస్తుల మార్కెట్లో లభిస్తున్నాయి.
‘నరీష్ యూ’ అనే సూపర్‌ఫుడ్ కంపెనీలో సమంత వ్యాపార భాగస్వామిగా మారింది. ఈ సంస్థ ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను విక్రయిస్తుంటుంది. ముఖ్యంగా క్వినోవా, చియా సీడ్స్‌ను భారత్‌లో అందుబాటులోకి తెచ్చింది.
‘సస్టెయిన్‌కార్ట్’.. ఇది పర్యావరణహితమైన వస్తువులను విక్రయించేందుకు ప్రారంభమైన ఈ-కామర్స్ సంస్థ. ఇందులోనూ సమంత పెట్టుబడులు పెట్టింది.
ఈ భామ సినిమా నిర్మాణ రంగంలోనూ అడుగుపెట్టింది. ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్’ అనే బ్యానర్‌ను ప్రారంభించింది. ‘మా ఇంటి బంగారం’అనే సినిమా చేస్తోంది.
తాజాగా వరల్డ్ పికిల్‌బాల్ లీగ్‌లో చెన్నై ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. టెన్నిస్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్‌ను పోలి ఉంటుంది ఈ గేమ్. అయితే, దీనికి ప్రత్యేకమైన రూల్స్ ఉన్నాయి.
తన స్నేహితులతో కలిసి సమంత ‘ఏకమ్ ఎర్లీ లెర్నింగ్ సెంటర్’ అనే ప్రీస్కూల్‌ను ప్రారంభించింది. ఇది జూబ్లీహిల్స్‌లో ఉంది.
ఎలక్ట్రానిక్స్ కంపెనీ ‘మీవీ’ సహా పలు బ్రాండ్స్‌కు సమంత అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. వీటి ద్వారా కూడా ఆమె ఆదాయం పొందుతోంది.
వ్యాపారాలతోపాటు మరోవైపు సమాజసేవ కూడా చేస్తోంది. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా అవసరాల్లో ఉన్న మహిళలు, చిన్నారులను ఆదుకుంటోంది.