శాంసంగ్‌ గెలాక్సీ A సీరీస్‌లో కొత్త ఫోన్లు!

ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ శాంసంగ్‌ తాజాగా గెలాక్సీ A సిరీస్‌లో రెండు కొత్త 5జీ మోడల్స్‌ గెలాక్సీ A14, గెలాక్సీ A23ని విడుదల చేసింది. వాటి వివరాలివిగో..

Image: Samsung

గెలాక్సీ A14

ఈ మొబైల్‌ 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.6 అంగుళాల పీఎల్‌ఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తోంది. దీంట్లో ఎగ్జినోస్‌ 1300 ఆక్టా-కోర్‌ ప్రాసెసర్‌ను వాడారు. 

Image: Samsung

వెనకవైపు 50 + 2 + 2 ఎంపీ కెమెరాలు, ముందుభాగంలో 13 ఎంపీ కెమెరా అమర్చారు. 14 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 

Image: Samsung

డార్క్‌ రెడ్‌, గ్రీన్‌, బ్లాక్‌ రంగుల్లో లభించే ఈ మొబైల్‌లో ర్యామ్‌ ప్లస్‌ ఫీచర్‌తో వర్చువల్‌గా ర్యామ్‌ను పెంచుకునే వెసులుబాటు ఉంది.

Image: Samsung

4జీబీ/64జీబీ వేరియంట్‌ ధర రూ. 16,499.. 6జీబీ/128జీబీ వేరియంట్‌ ధర రూ. 18,999.. 8జీబీ/128 జీబీ వేరియంట్‌ ధర రూ. 20,999.

Image: Samsung

గెలాక్సీ A23

ఈ మొబైల్‌లో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.6 అంగుళాల పీఎల్‌ఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇచ్చారు. క్వాల్‌కోమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 695 ప్రాసెసర్‌ను వినియోగించారు. 

Image: Samsung

వెనకవైపు 50 + 5 + 2 + 2 ఎంపీ కెమెరాలున్నాయి. ముందువైపు 13 ఎంపీ కెమెరా ఇచ్చారు. ఇందులో 25 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది.

Image: Samsung 

సిల్వర్‌, ఆరెంజ్‌, బ్లూ రంగుల్లో లభించే ఈ మొబైల్‌లోనూ ర్యామ్‌ ప్లస్‌ ఫీచర్‌తో ర్యామ్‌ను పెంచుకోవచ్చు. 

Image: Samsung

6జీబీ/128 జీబీ వేరియంట్‌ ధర రూ. 22,999 కాగా.. 8 జీబీ/128 జీబీ ధర రూ.24,999గా ఉంది. 

Image: Samsung

సామాజిక మాధ్యమాలను సానుకూలంగానూ ఉపయోగించొచ్చు..

లింక్డిన్‌ ప్రొఫైల్‌ ఆకర్షణీయంగా రూపొందించాలా?

పిల్లలు విసిగిస్తున్నారని ఫోన్ ఇస్తున్నారా?

Eenadu.net Home