హీరోల లక్కీ స్టార్‌.. ఈమె!

కేరళ బ్యూటీ సంయుక్త ‘భీమ్లా నాయక్‌’లో చిన్న పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత హీరోయిన్‌గా మంచి అవకాశాలు వస్తున్నాయి.

Image: Instagram/Samyuktha

కొందరు హీరోలకు సంయుక్త అదృష్టదేవతగా మారిపోయింది. చాలా కాలంగా పలువురు హీరోలు మంచి హిట్‌ కోసం ఎదురుచూస్తుండగా.. ఈమెతో నటించిన సినిమాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి.

Image: Instagram/Samyuktha

‘పటాస్‌’ తర్వాత కల్యాణ్‌రామ్‌కు సరైన హిట్‌ లేదు. ఇటీవల ‘బింబిసార’తో ఘన విజయాన్ని అందుకున్నాడు. ఇందులో సంయుక్త పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించింది. 

Image: Instagram/Samyuktha

కోలీవుడ్‌ స్టార్‌ ధనుష్.. గ్లోబల్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నా గత సినిమాలు అనుకుంత సక్సెస్‌ను అందించలేకపోయాయి. ఇటీవల ఆయన నటించిన ‘వాతి(తెలుగులో సార్‌)’ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించింది. ఇందులో సంయుక్త టీచర్‌గా మెరిసింది.

Image: Instagram/Samyuktha

ఇక తాజాగా సాయిధరమ్‌తేజ్‌ ‘విరూపాక్ష’తో హిట్‌ కొట్టాడు. అతడి గత రెండు సినిమాలకు ప్రేక్షకాదరణ లభించలేదు. ‘విరూపాక్ష’కు మాత్రం ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇందులో సంయుక్త పల్లెటూరు అమ్మాయిగా నటించింది.

Image: Instagram/Samyuktha

ప్రస్తుతం సంయుక్త మరోసారి కల్యాణ్‌రామ్‌తో ‘బింబిసార 2’తోపాటు ‘డెవిల్‌’లోనూ నటిస్తోంది.

Image: Instagram/Samyuktha

గతంలో తమిళ, మలయాళ చిత్రాల్లో నటించినా.. తెలుగు చిత్రాల్లో నటించడంతోనే తన కెరీర్‌ మలుపు తిరిగిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. 

Image: Instagram/Samyuktha

తెలుగుభాషపై ఆసక్తితో 15 రోజుల్లోనే ట్యూటర్‌ని పెట్టుకొని మరీ తెలుగు నేర్చుకుందట. ఇప్పుడు సంయుక్త.. తనని తాను తెలుగమ్మాయిగా చెప్పుకుంటోంది. 

Image: Instagram/Samyuktha

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home