క్వీన్‌ ఆఫ్‌ క్వీన్స్‌.. సంయుక్త

టాలీవుడ్‌, మాలీవుడ్‌లో ఫుల్‌ క్రేజ్‌ సంపాదించుకున్న సంయుక్త ఇప్పుడు బాలీవుడ్‌లో అడుగు పెట్టేందుకు సిద్ధమైంది. 

‘మహారాజ్ఞి: క్వీన్‌ ఆఫ్‌ క్వీన్స్‌’లో మోహిని పాత్రలో నటిస్తోంది. చరణ్‌తేజ్‌ ఉప్పలపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది.

‘మనందరం కలలు కంటాం. కానీ వాటిల్లో కొన్నే నిజమవుతాయి. అలాంటి డ్రీమ్‌రోల్‌నే నేను ‘మహారాజ్ఞి..’లో చేస్తున్నాను’ అని చెప్పింది.

తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలతో అలరించిందీ బ్యూటీ. ‘నా ఫేవరెట్‌ కాజోల్‌, ప్రభుదేవాతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది’ అంటోంది.

 తెలుగులో నిఖిల్‌ ‘స్వయంభూ’లో నటిస్తోంది. అక్టోబర్‌లో ఈ సినిమా విడుదల కానుంది. మలయాళంలో ‘రామ్‌’ షూటింగ్‌ దశలో ఉంది.  

సంయుక్త ఎన్ని సినిమాలు చేసినా టాలీవుడ్‌లో గుర్తుండిపోయేవి ‘సార్‌’, ‘విరూపాక్ష’. ఈ చిత్రాల్లో ఈమె నటనకు తెలుగు అభిమానుల నుంచి మంచి మార్కులే పడ్డాయి.

ఇటీవల విడుదలైన ‘లవ్‌మి ఇఫ్‌ యూ డేర్‌’లోనూ అతిథి పాత్రలో అలా.. మెరిసింది. 

‘డెవిల్‌’, ‘బింబిసార’లో నటించి, మెప్పించి కల్యాణ్‌రామ్‌కు సూపర్‌ జోడీ అని విమర్శకుల నుంచీ ప్రశంసలు అందుకుంది. 

పురాణాల నేపథ్యంలో స్త్రీల శక్తి గురించి వివరించే సినిమా ‘ఆదిశక్తి’లోనూ సంయుక్త నటిస్తుందనే ప్రచారం జరుగుతోంది. 

సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నా తరచూ ఫొటోలు, డే యాక్టివిటీ వీడియోలతో నెట్టింట సందడి చేస్తుంటుంది. ఇన్‌స్టాలో ఈమెని 30లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. 

లక్కీ భాస్కర్‌.. జీవిత సత్యాలు

నిమ్రత్‌ @ 8.. రూమర్స్‌తో ట్రెండింగ్‌లోకి!

ఇండియాలో టాప్‌- 10 ‘గూగుల్డ్‌’ షోస్‌

Eenadu.net Home