టాలీవుడ్‌లో దూసుకెళ్తున్న మలయాళీ బ్యూటీ

పవన్‌ కల్యాణ్‌ హీరోగా వచ్చిన ‘భీమ్లా నాయక్‌’తో టాలీవుడ్‌కు పరిచయమైంది మలమాళీ ముద్దుగుమ్మ సంయుక్త మేనన్‌.

Source:samyuktha menon

ఈ సినిమాలో రానా భార్య పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

Source:samyuktha menon  

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది.

Source:samyuktha menon 

‘బింబిసార’తో మరోసారి టాలీవుడ్ ఫ్యాన్స్‌ని అలరించేందుకు సిద్ధమైందీ నాయిక. కల్యాణ్‌ రామ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 5న విడుదల కానుంది.

Source:samyuktha menon 

‘పాప్‌ కార్న్‌’ అనే మలయాళ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది ఈ బ్యూటీ.

Source:samyuktha menon 

ఈ సినిమా చూసిన చాలామంది తనకు నటించడం రాదన్నారని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Source:samyuktha menon 


టాలీవుడ్‌లోకి అడుగుపెట్టడానికి ముందు ప్రత్యేకంగా శిక్షకుడిని నియమించుకుని మరీ తెలుగు నేర్చుకుందట ఈ కేరళ అందం.

Source:samyuktha menon 


 ‘కడువా’లో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ సరసన నటించింది సంయుక్త మేనన్‌. ఈ చిత్రం ఇటీవల విడుదలైంది.

Source:samyuktha menon 

వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా 'సర్' ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కథానాయికగా సంయుక్త ఛాన్స్‌ కొట్టేసింది.

Source:samyuktha menon 


సాయిధరమ్‌ తేజ్‌ 15వ చిత్రంలోనూ నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటోంది.

Source:samyuktha menon 


‘ఒకప్పుడు ఉద్యోగంలో స్థిరపడటమే నా ఏకైక లక్ష్యం. అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చా. ఆ తర్వాత సినిమానే నా లోకమైంది’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఈ భామ.

Source:samyuktha menon 

రిద్ది.. ప్రభాస్‌తో అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా!

కృతి సనన్.. గ్లామర్‌ అదిరెన్‌..!

బిహారీ భామ.. ఐశ్వర్యా సుస్మిత

Eenadu.net Home