మెగాస్టార్‌ని ఫిదా చేసిన బిహారి భామ

సంచితా బసు.. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే వారికి పరిచయం అక్కర్లేని పేరు. ఈ కుర్రభామ ప్రస్తుతం హీరోయిన్‌గా మారింది.

Image:Instagram/Sanchitha Bashu

‘జాతి రత్నాలు’ దర్శకుడు అనుదీప్‌ అందించిన కథతో తెరకెక్కిన ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’తో తెరంగేట్రం చేసింది. ఈ చిత్రం తాజాగా విడుదలైంది. హీరోగా శ్రీకాంత్‌ రెడ్డి నటించాడు.

Image:Instagram/Sanchitha Bashu

ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సంచిత కళ్లకి, నవ్వుకి ఆయన ఫిదా అయ్యారు.

Image:Instagram/Sanchitha Bashu

పవన్‌ కల్యాణ్‌ ‘ఖుషి’ సినిమా ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో టికెట్ల కోసం ఓ యువకుడు చేసిన సాహసం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది.

Image:Instagram/Sanchitha Bashu

సంచితా బసు 2003 మార్చి 24న బిహార్‌లోని భగళ్పూర్‌లో జన్మించింది. ప్రస్తుతం ఇంటర్‌ చదువుతోంది.

Image:Instagram/Sanchitha Bashu

అప్పట్లో సంచలనం సృష్టించిన ‘టిక్‌ టాక్‌’లో వీడియోలు చేసి ఫేమస్‌ అయింది. కొన్నాళ్లకు వివిధ కారణాలతో భారత ప్రభుత్వం టిక్‌టాక్‌ని బ్యాన్‌ చేయడంతో నిరాశకు గురైందట.

Image:Instagram/Sanchitha Bashu

ఈ బ్యూటీకి ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోనూ మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఎఫ్‌ బీలో 5 మిలియన్‌, ఇన్‌స్టాలో 2.2 మిలియన్ల నెటిజన్లు ఆమెని అనుసరిస్తున్నారు.

Image:Instagram/Sanchitha Bashu

తను అందంగా, ఆరోగ్యంగా ఉండటానికి నిత్యం యోగా, వర్కౌట్స్‌ చేస్తుందట.

Image:Instagram/Sanchitha Bashu

ఈ బ్యూటీ చేసిన టిక్‌ టాక్‌ వీడియోలు చూసి దర్శకుడు అనుదీప్‌ ఆడిషన్స్‌కు పిలిచారట. ఈ విషయాన్ని ఆమెనే ఓ సందర్భంలో వెల్లడించింది. 

Image:Instagram/Sanchitha Bashu

‘‘ధనుష్‌, అల్లు అర్జున్‌, ప్రభాస్‌ అంటే ఇష్టం. వారితో కలిసి పని చేయాలని ఉంది’’ అని సంచిత ఓ సందర్భంలో వెల్లడించింది.

Image:Instagram/Sanchitha Bashu

డ్యాన్సింగ్‌, ట్రావెలింగ్‌, షాపింగ్‌ ఈ బ్యూటీ హాబీస్‌.

Image:Instagram/Sanchitha Bashu

ఓటీటీలో అలరించడానికి సిద్ధమైన సినిమాలు/సిరీస్‌లు

స్కూల్‌లో ప్రపోజ్‌ చేసి.. గుడిలో పెళ్లి చేసుకుని..

ఓనం సొగసుల్‌.. అదిరెన్‌..

Eenadu.net Home