బాప్‌రే భన్సాలీ.. ‘హీరామండి’
బాలీవుడ్ హిట్ చిత్రాల దర్శకుడిగా సంజయ్ లీలా భన్సాలీకి పేరుంది. అలియా భట్ వేశ్య ప్రాతలో నటించిన గంగూబాయి కాఠియావాడి ఫార్ములా విజయవంతం కావడంతో మరో వేశ్యల కథను తాజాగా ప్రేక్షకుల మందుకు తీసుకొచ్చేందుకు ఆయన సిద్ధమయ్యారు.
Image : Instagram
Image: Instagram
ఆ చిత్రమే ‘హీరామండి’. లాహోర్‌లోని ఓ వేశ్యావాటిక నేపథ్యంలో సాగే ఈ కథలో ప్రముఖ నటీమణులు మనీషా కోయిరాల, సోనాక్షి సిన్హా, అతిదిరావు హైదరీ, రిచా చద్దా, షర్మిన్ సెగల్, సంజీద షేక్ నటిస్తున్నారు. ఆ తారాగణంపై ఓ లుక్కేయండి.
Image : Instagram
మనీషా కోయిరాల
నేపాల్‌కు చెందిన ఈమె 90వ దశకంలో విడుదలైన భారతీయుడు, క్రిమినల్, బొంబాయి వంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. సినిమాలకు దాదాపుగా దూరమైనట్లు కనిపించి 2019లో ‘లస్ట్ స్టోరీస్’తో మళ్లీ తెరపై తళుక్కుమంది.
Image : Instagram
సోనాక్షి సిన్హా
శత్రుఘ్న సిన్హా నట వారసురాలిగా ఈమె ‘దబాంగ్’తో ఎంట్రీ ఇచ్చింది. రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘లింగ’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది.
Image : Instagram
అతిదిరావు హైదరీ
హిందీ, తమిళ్, తెలుగు చిత్రాల్లో ఈ ముద్దుగుమ్మ నటించింది. ‘సమ్మోహనం’, ‘అంతరిక్షం’, ‘వి’, ‘మహాసముద్రం’ వంటి తెలుగు చిత్రాలతో అలరించింది. ఏ భాషలోనైనా సరే ఏడాదికో సినిమా లెక్కన తెరపై వెలిగిపోతోంది.
Image : Instagram
రిచా చద్దా
‘ఓయ్ లక్కీ లక్కీ ఓయ్’లో చిన్న పాత్రలో తొలిసారి కనిపించింది. ‘చాక్ అండ్ డస్టర్’లో జర్నలిస్టుగా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. 2017లో వచ్చిన ‘ఇన్‌సైడ్ ఎడ్జ్’ వెబ్‌సిరీస్‌లో కష్టాలను ఎదుర్కొంటున్న నటిగా కనిపించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
Image : Instagram
షర్మిన్ సెగల్
అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ‘మలాల్’తో నటిగా మారింది. బెస్ట్ ఫిమేల్ డెబ్యూగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు సొంతం చేసుకుంది. భన్సాలీ గత చిత్రం ‘గంగూబాయి’కి కూడా ఈమె అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయడం విశేషం.
Image : Instagram
సంజీద షేక్
కెరీర్ తొలినాళ్లలో టెలివిజన్ రంగంలో రాణించి.. బాగా ప్రాచుర్యం పొందింది సంజీద షేక్. అప్పుడప్పుడూ సినిమాల్లో నటిస్తూ వెండితెర ప్రేక్షకులను సైతం మెప్పిస్తోంది.
Image : Instagram