సంజు భారీ సిక్సర్ల సీక్రెట్ ఇదే 

సంజు శాంసన్ సూపర్‌ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో రెండు సెంచరీలు బాది విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. 

అద్భుతమైన పవర్‌ హిట్టింగ్‌తో అలవోకగా సిక్సర్లు బాదిన తీరు చూసి తీరాల్సిందే. ఇలా సిక్స్‌లు కొట్టేందుకు శాంసన్‌ జిమ్‌లో చాలా శ్రమిస్తాడు.

చేతులు బలంగా మారేందుకు జిమ్‌ టైమ్‌లో రోజుకు సుమారు మూడు గంటలపాటు వర్కౌట్స్‌ చేస్తాడు.

కఠినమైన సింగిల్ లెగ్ డెడ్ లిప్ట్స్‌, సింగిల్ లెగ్ హుప్‌ టూ బాక్స్‌, హైడెన్స్, షోల్డర్‌ వైటీఎల్ తదితర కసరత్తులు చేయడం సంజుకి ఇష్టం.

భారీ చైన్‌ను తన భుజాలపై వేసుకుని వర్కౌట్స్‌ చేస్తున్న ఫొటోలు గతేడాది వైరల్‌ అయ్యాయి. 

ఇక తన డైట్‌లో చికెన్ సూప్, సలాడ్స్‌, ఆకు కూరలు, తాజా పండ్లు ఉండేలా చూసుకుంటాడు. అన్నంతోపాటు నూనెతో తయారు చేసిన పదార్థాలు, స్వీట్లకు దూరంగా ఉంటాడు. 

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో శాంసన్ 216 పరుగులు చేశాడు. ఇందులో 11 ఫోర్లు, 19 సిక్సర్లు ఉన్నాయి. 

టీ20ల్లో వేగవంతమైన సెంచరీ.. భారత బ్యాటర్లు వీరే!

ఆ ‘పింక్‌’ మ్యాచ్‌లో ఏమైంది?

ఐపీఎల్ వేలం.. ఖరీదైన అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్‌

Eenadu.net Home