సప్త మోక్ష పురి.. సందర్శిస్తే జన్మ ధన్యం!

దేశంలోని ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాలను కలిపి ‘సప్త మోక్ష పురి’ అని అంటారు. వాటిని సందర్శిస్తే జన్మ ధన్యమవుతుందని, మోక్షం కలుగుతుందని హిందువుల నమ్మకం. మరి ఆ పుణ్యక్షేత్రాలేవి? ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దామా..?  

అయోధ్య

శ్రీరాముడి జన్మస్థలం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సరయూ నది తీరంలోని ఈ నగరంలోనే రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జనవరి 22న జరగనుంది. ఆ తర్వాత భక్తుల కోలాహలం మొదలుకానుంది.

మధుర

శ్రీకృష్ణుడి జన్మస్థలంగా హిందువులు భావిస్తారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని యమునా నది ఒడ్డునే ఈ నగరముంది. దీన్ని రాముడి సోదరుడు శతృజ్ఞుడు నిర్మించినట్లు పురాణాల్లో పేర్కొన్నారు. 

హరిద్వార్‌

ఉత్తరాఖండ్‌లో గంగానది తీరాన ఉందీ ఆలయం. ఇక్కడ కొలువుదీరిన విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి ఏటా వేల మంది భక్తులు వస్తుంటారు. పన్నెండేళ్లకోసారి కుంభమేళా జరుగుతుంటుంది. 

వారణాసి

ఉత్తరప్రదేశ్‌లోని కాశీనే వారణాసి, బెనారస్‌గా పిలుస్తారు. గంగా నది ఒడ్డున ఉన్న ఈ పుణ్యక్షేత్రంలో శివుడు కాశీవిశ్వనాథుడిగా భక్తులకు దర్శనమిస్తాడు. చాలా మంది తమ జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకునే పుణ్యక్షేత్రమిది. 

కాంచీపురం

తమిళనాడులోని పలార్‌ నది తీరంలో పల్లవ రాజులు నిర్మించిన ఈ నగరంలో అనేక దేవాలయాలున్నాయి. వరదరాజ పెరుమాళ్‌, ఏకాంబరేశ్వర్‌, కామాక్షి అమ్మన్‌, కుమారకొట్టన్‌ ఆలయాలు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. 

Image:google

ఉజ్జయిని

మధ్యప్రదేశ్‌లోని శిప్రా నది ఒడ్డున ఈ పుణ్యక్షేత్రముంది. జ్యోతిర్లింగాల్లో ఒకటైన మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఇక్కడే ఉంది. పన్నెండేళ్లకోసారి జరిగే కుంభమేళాకు లక్షలాది మంది తరలివస్తుంటారు.

Image:google

ద్వారక

శ్రీకృష్ణుడు పరిపాలించిన నగరం. శత్రువుల నుంచి తన ప్రజలను రక్షించుకునేందుకు శ్రీకృష్ణుడు తన రాజ్యాన్ని మధుర నుంచి గుజరాత్‌లోని గోమతి నది వద్ద నిర్మించిన ద్వారకకు మార్చాడు. 

కార్తికంలో వనభోజనాలు, ప్రాతఃకాల స్నానాలు, ఉపవాసాలు ఎందుకు చేస్తారు?

అయోధ్య ధగ ధగ.. గిన్నిస్‌తో మెరవగా..

దీపావళి అయిదు రోజులు ఎందుకు చేస్తారో తెలుసా?

Eenadu.net Home