‘కాంతార’ సుందరి.. సప్తమి గౌడ
తను నటించిన రెండో చిత్రంతోనే భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది కన్నడ నటి సప్తమి గౌడ.
Image:Instagram
ఇటీవల కన్నడనాట విడుదలైన ‘కాంతార’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇందులో సప్తమి గౌడ కథానాయిక.
Image:Instagram
చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ను మేకర్స్ ఇతర భాషల్లోనూ విడుదల చేశారు. తాజాగా ఓటీటీలోనూ విడుదలైంది.
Image:Instagram
రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సప్తమి పల్లెటూరి అమ్మాయిగా కనిపించి ఆకట్టుకుంది.
Image:Instagram
ఈ కన్నడ భామ..1996 జూన్ 8న బెంగళూరులో జన్మించింది. తండ్రి ఉమేష్ ఎస్‌కే దొడ్డి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్.
Image:Instagram
బెంగళూరులోని బీఐటీలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది.
Image:Instagram
ఈ బ్యూటీ 2020లో విడుదలైన ‘పాప్‌కార్న్ మంకీ టైగర్’తో తెరంగేట్రం చేసింది.
Image:Instagram
డ్యాన్సింగ్, బుక్ రీడింగ్, ట్రావెలింగ్ హాబీస్. నేషనల్ లెవల్ స్విమ్మర్ కూడా.
Image:Instagram
ఫిట్‌నెస్‌కి ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది. నిత్యం జిమ్‌కి వెళ్లి కసరత్తులు చేస్తుంటుంది.
Image:Instagram