నా భర్తనే ఇల్లరికం రమ్మంటా!

ఇటీవల ‘మర్డర్‌ ముబారక్‌’, ‘యే వతన్‌ మేరే వతన్‌’ చిత్రాలతో అలరించిన సారా అలీఖాన్‌ మరో మూడు చిత్రాల షూటింగ్‌తో బిజీ బిజీగా ఉంది.

అనురాగ్‌ బసు దర్శకత్వంలో ఆదిత్య రాయ్‌, సారా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘మెట్రో ఇన్‌ దినో’. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.

ఇదే కాకుండా ఆక్షయ్‌ కుమార్‌ సరసన ‘స్కై ఫోర్స్‌’లోనూ, టైగర్‌ ష్రాఫ్‌తో ‘ఈగల్‌’లోనూ నటిస్తోంది.

మహారాష్ట్ర(1995)లో పుట్టిన ఈమె ముంబయిలో చదువుకుంది. డిగ్రీ పూర్తి చేసింది. కాలేజీ సమయంలో తల్లితో కలిసి ఓ మ్యాగజైన్‌ కవర్‌స్టోరీ కోసం ఫొటోషూట్‌లో పాల్గొంది.

డిగ్రీలో ఉన్నప్పుడే సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. కానీ తండ్రి సైఫ్‌ అలీఖాన్, తల్లి అమృత.. చదువును కొనసాగించాలని సూచించడంతో చదువుపై దృష్టి పెట్టింది.

‘కేదార్‌నాథ్‌’తో 2018లో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది సారా. ఆ తర్వాత వరుస ఛాన్స్‌లు సంపాదించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

This browser does not support the video element.

‘లవ్‌ ఆజ్‌ కల్’, ‘కూలీ నం. 1’, ‘అత్రంగి రే’, ‘గ్యాస్ లైట్’, ‘జర హట్కే జర బచ్కే’, ‘రాఖీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కథా’ వంటి పలు చిత్రాల్లో నటించింది.

సారా సోషల్ మీడియాలో యాక్టివ్‌. ఎప్పటికప్పుడు తన సినిమాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తన ఇన్‌స్టా ఖాతాకి 4.5 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.  

 ‘నేను ఎలా రెడీ అవ్వాలో ఇప్పటికీ అమ్మే చెబుతుంది. రోజులో ఎన్ని పనులతో బిజీగా ఉన్నా తిరిగి అమ్మ ఒడికే చేరుతా. నాకు కాబోయే భర్త కూడా ఇల్లరికానికి రావల్సిందే’ అని అంటోందీ బ్యూటీ.

ఈమెకి ప్రకృతిలో గడపడం బాగా ఇష్టం. అడవులు, బీచ్‌లు తన ఫేవరెట్‌ ప్లేసెస్‌. ‘బీచ్‌ను చూస్తూ కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది’ అని చెబుతోంది. 

This browser does not support the video element.

సారాకి ఖాళీ సమయం దొరికితే డ్యాన్స్‌ చేస్తుంది. పలు అవార్డు వేడుకల్లో స్టేజీపై పర్‌ఫార్మెన్స్‌ ఇస్తుంది. స్లిమ్‌గా ఉండేందుకు ఇది కూడా దోహదపడుతుందని అంటోంది.

కేన్స్‌లో హాలీవుడ్‌ సొగసులు

‘విశ్వంభర’లో ఆషికా రంగనాథ్‌

సొంత అవుట్‌ ఫిట్‌తో కేన్స్‌కు!

Stories.eenadu.net Home