ట్రెండ్‌లోనే కాదు.. చదువులోనూ టాపే!

నెటిజన్లకు సచిన్‌ తెందూల్కర్‌ కుమార్తె సారా తెందూల్కర్‌ పరిచయం అక్కర్లేదు. సోషల్‌ మీడియాలో ఆమె సందడి అంతా ఇంతా కాదు.

తాజాగా యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌ నుంచి మెడిసిన్‌లో మాస్టర్స్‌ పూర్తి చేసి పట్టా అందుకుంది. ఆమె కాన్వకేషన్‌ డేకి తల్లిదండ్రులు సచిన్‌, అంజలి హాజరయ్యారు. 

ఈ సందర్భంగా సచిన్‌ ‘ప్రియమైన సారా జీవితంలో నువ్వు పెద్ద మైలురాయిని చేరుకున్నావు. తల్లిదండ్రులుగా మేము ఈ విషయంలో గర్వపడుతున్నాం..’ అంటూ తన ఎక్స్‌ ఖాతాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. 

This browser does not support the video element.

మదర్స్‌డే రోజున తన తల్లి కోసం బహుమతుల వీడియో ఒకటి సారా ఇన్‌స్టాలో పోస్టు చేసింది. ఆ పోస్ట్‌ తెగ వైరలైంది.

సారా ముంబయి(1997) లో జన్మించింది. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ఆమెకు బాగా నచ్చుతాయి. 

దిల్లీలోని దీరూభాయి ఇంటర్నేషనల్‌ స్కూల్లో చదువుకుంది. స్కూలు తర్వాత మెడిసిన్‌ చేసేందుకు లండన్‌ వెళ్లింది. 

తన ఫ్యాషన్‌, ట్రెండీ లుక్స్‌తో యువతను ఆకట్టుకుంటోంది. తరచూ ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాలో పోస్టు చేస్తుంటుంది.

స్నేహితులతో కలిసి సరదాగా పార్టీలు ఫంక్షన్లలో సందడి చేస్తుంది. కొత్త కొత్త ప్రదేశాలను సందర్శించడం అంటే ఇష్టం.

ఆ మధ్య సారా.. మోడలింగ్‌లోనూ అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపర్చింది. ఓ దుస్తుల బ్రాండ్‌ కోసం యాడ్‌లో నటించింది. ప్రస్తుతం సౌందర్య ఉత్పత్తుల కోసం అనేక యాడ్స్‌లో నటిస్తోంది.

క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌, సారా ప్రేమలో ఉన్నట్లు నెట్టింట తెగ చర్చ జరిగింది. కానీ, దీనిపై గిల్‌, సారా ఎప్పుడూ స్పందించలేదు. 

This browser does not support the video element.

ఎక్కువగా విదేశాల్లో, ప్రకృతి ఒడిలో గడిపేందుకే ఇష్టపడుతుంది. తన సోషల్‌ మీడియా ఖాతాల్లోనూ విహారయాత్ర ఫొటోలే ఎక్కువగా ఉంటాయి.   

ఫిట్‌గా ఉండేందుకు ఎక్కువ సమయం వ్యాయామం చేయడంతోపాటు స్విమ్మింగ్‌ చేస్తుంది. ఐస్‌క్రీం అంటే చాలా ఇష్టం. అది ఉంటే చాలు ఇంకేం వద్దంటోంది.

సూర్య బెస్ట్‌ చిత్రాలు.. ఏ ఓటీటీలో...

మిల్కీ బ్యూటీ.. ట్రెండింగ్‌ క్యూటీ!

నేను ఫుడ్‌ లవర్‌ని.. నోరు కట్టేసేకోను!

Eenadu.net Home