సారా సర్ఫింగ్‌.. సోషల్‌ మీడియా షేకింగ్‌!

సచిన్‌ తనయ సారా తెందూల్కర్‌ తరచూ ఫొటోషూట్లు, ట్రిప్పులతో సోషల్‌ మీడియాలో సందడి చేస్తుంటుంది. తాజాగా ఆమె ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

అడ్వెంచర్లు చేయడం అంటే ఇష్టం. స్కూబా డైవింగ్‌, సర్ఫింగ్‌ వంటివి తరచూ చేస్తుంది. సర్ఫింగ్‌ చేస్తున్న ఫొటోలే ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. 

1997లో ముంబయిలో పుట్టింది. లండన్‌లో మెడిసిన్‌లో మాస్టర్స్‌ పూర్తి చేసింది. సొంతంగా బిజినెస్‌ చేస్తోంది. 

న్యూట్రిషనల్‌ కోచ్‌గా పని చేస్తూనే.. ఆన్‌లైన్‌ స్టోర్స్‌ని నడుపుతోంది. వివిధ ఫ్యాషన్‌, సౌందర్య ఉత్పత్తులకు అంబాసిడర్‌గా, స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది.

‘పండగ సమయాల్లో కుటుంబంతో గడపడం.. అమ్మతో కలిసి వంటచేయడం, షాపింగ్‌ ఎక్కువ ఆనందాన్నిస్తాయి’ అని చెప్పింది.

స్నేహితులతో కలిసి ట్రిప్పులకు ఎక్కువగా వెళుతుంది. జీవితాన్ని ఆస్వాదిస్తూ, సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్లడమే తన పాలసీ.

ఫిట్‌నెస్‌ కోసం వ్యాయామం చేస్తుంది. పార్క్‌లో ఉదయాన్నే వాకింగ్‌ చేస్తే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అని చెబుతోంది.  

బయటకు వెళ్తే తన మెనూలో ఐస్‌క్రీమ్‌, కోల్డ్‌ కాఫీ, సాఫ్ట్‌ డ్రింక్‌.. వీటిల్లో ఏదో ఒకటి ఉండాల్సిందే! స్ట్రాబెర్రీ ఐస్‌క్రీమ్‌ ఫేవరెట్‌.

తండ్రి నిర్వహిస్తున్న ‘సచిన్‌ తెందూల్కర్‌ ఫౌండేషన్‌’లో డైరెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు తీసుకుంది. ఖాళీ సమయంలో ఫౌండేషన్‌కు వెళ్లి పిల్లల బాగోగులు చూసుకుంటుంది.

ఇన్‌స్టాలో 76 లక్షల మంది సారాను ఫాలో అవుతున్నారు.

ఓల్డ్‌ + న్యూ= కొత్త రెట్రో

ముక్కు పుడక.. మస్తుంది మేడం!

బరువు సంగతి.. జిమ్‌లో చూసుకుందాంలే!

Eenadu.net Home