బడ్జెట్ వేళ.. నిర్మలమ్మ చీర కళ!
బడ్జెట్‌కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధరించే చీరలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. చేనేత చీరలను ఇష్టపడే ఆమె.. దేశ సంస్కృతి ప్రతిబింబించేలా చీరలను ఎంపిక చేసుకుంటారు. 2019 నుంచి 2025 వరకు బడ్జెట్ వేళ నిర్మలమ్మ కట్టుకున్న శారీలివే!
2025
పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీదేవి.. నిర్మలమ్మకు కానుకగా ఇచ్చిన మధుబని చేనేత చీరను ధరించారు. గోధుమ వర్ణం, బంగారు అంచు చీరలో ఇలా..
2024
రామా బ్లూ టస్సర్ చీరపై బీజ్ కలర్ సిల్క్ త్రెడ్‌తో కాంతా వర్క్ చేసిన చీరలో కళగా ఆర్థిక మంత్రి
2024
మంగళగిరి మెజెంటా బోర్డర్‌తో క్రీమ్ కలర్, గోల్డెన్ జరీ గళ్లు, చెక్స్ శారీకి ప్లెయిన్ మెజెంటా బ్లౌజ్‌తో హుందాగా నిర్మలమ్మ.
2023
ఎరుపురంగు కసూతి చీరపై సిల్వర్ బుటీ వర్క్, బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్‌తో నిర్మలమ్మ.
2022
మెరూన్, సిల్వర్ కలర్‌లు ఉపయోగించి ఒడిశా చేనేత కళాకారులు నేసిన చీరలో నిండుగా ఆర్థిక మంత్రి.
2021
క్రీమ్, ఎరుపు రంగు పోచంపల్లి, ఇక్కత్ డిజైన్ చీరలో ఆకట్టుకున్న నిర్మలా సీతారామన్.
2020
గ్రీన్ కలర్ చిన్న బోర్డర్, గోల్డెన్ జరీ చీరకి మ్యాచింగ్ పసుపు రంగు బ్లౌజ్‌తో నిరాడంబరంగా నిర్మలమ్మ.
2019
గోల్డెన్ కడ్డీ బోర్డర్‌తో గులాబీ రంగు మంగళగిరి పట్టు చీరలో నిర్మలా సీతారామన్