సీజనల్ జబ్బులు.. జాగ్రత్త సుమీ!
శీతాకాలం చలితోపాటు.. సీజనల్ జబ్బుల్ని కూడా వెంట తీసుకొస్తుంది. ముందుగానే వీటిని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
Image: RKC
సాధారణ జలుబు
వాతావరణ మార్పు సమయంలో ఎక్కువగా ఈ జలుబు వస్తుంది. దీనికి కారణం రైనోవైరస్. ఈ వైరస్ సోకిన వ్యక్తులు తుమ్మినా, దగ్గినా అది ఇతరులకు వ్యాపిస్తుంది.
Image: RKC
దీనికి ప్రత్యేకించి చికిత్స అంటూ ఏమీ ఉండదు. కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది. జలుబు తీవ్రంగా ఉంటే యాంటీహిస్టమైన్, కాఫ్ సిరప్‌తో ఉపశమనం పొందొచ్చు.
Image: RKC
ఫ్లూ
ఇన్‌ఫ్లూయెంజా వైరస్ వల్ల ఫ్లూ బారినపడతారు. ఈ వైరస్ ఉన్న వారు తుమ్మినా, దగ్గినా.. వారి నుంచి ఇతరులకు ఫ్లూ వ్యాపిస్తుంది.
Image: RKC
దీనికి కూడా విశ్రాంతి అవసరం. ఫ్లూ తీవ్రంగా ఉంటే వైద్యుల సూచన మేరకు యాంటివైరల్ డ్రగ్స్ వేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా నీరు తాగాలి. ఫ్లూ సోకిన 48 గంటల్లో చికిత్స తీసుకుంటే ఫలితం ఉంటుంది.
Image: RKC
గొంతు నొప్పి
బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల గొంతులో నొప్పి మొదలవుతుంది. ఎక్కువగా పిల్లల్లో ఈ సమస్య వస్తుంటుంది. యాంటిబయోటిక్స్ మందులతో నయమవుతుంది.
Image: RKC
రొమ్ము పడిశం(బ్రాంకైటిస్)
ఊపిరితిత్తుల్లోకి గాలిని పంపించే గొట్టాలకు వైరస్ సోకడం వల్ల ఈ సమస్య వస్తుంది. శ్వాసకోశం, వాహికలో వాపు ఏర్పడుతుంది.
Image: RKC
వారమైనా దగ్గు తగ్గకపోవడం, ముక్కు కారడం, పిల్లికూతలు, ఆయసం వంటి లక్షణాలుంటే వైద్యులను సంప్రదించి ఔషధాలు వాడాలి. నెబ్యూలైజర్, కాఫ్ సిరప్, పెయిన్ రిలీవర్స్ వంటివి వాడాల్సి ఉంటుంది.
Image: RKC
న్యూమోనియా
ఊరిపితిత్తులకు వైరస్/బ్యాక్టీరియా/ఫంగస్ సోకితే న్యూమోనియా తలెత్తుతుంది. చిన్నారుల్లో, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఇది ఎక్కువగా వస్తుంది.
Image: RKC
ఛాతి నొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, చలి, జ్వరం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. యాంటి బయోటిక్స్‌తో ఇది నయమవుతుంది. సమస్య తీవ్రమైతే మరిన్ని ఔషధాలు వాడాల్సి రావొచ్చు.
Image: RKC
కోరింత దగ్గు
బ్యాక్టీరియాల వల్ల వచ్చే ఈ కోరింత దగ్గు ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తుంటుంది. కొన్ని వారాలపాటు దగ్గు ఇబ్బంది పెడుతుంది.
Image: RKC
కోరింత దగ్గును మొదటి దశలోనే గుర్తించి యాంటిబయోటిక్స్ వాడితే ఫలితముంటుంది. వెచ్చనిప్రదేశంలో ఉంటూ.. వీలైనంత ఎక్కువ ద్రవాహారం తీసుకోవాలి. దుమ్ములోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి.
Image: RKC