#eenadu

ఇడ్లీ, దోశ టిఫిన్‌లతో బోర్‌ కొడుతుందని పిల్లలు మారాం చేస్తున్నారా..! అయితే‘కార్న్‌ క్యాప్సికం రింగ్స్‌’ట్రై చేయండి..

క్యాప్సికమ్‌ని కడిగి, తుడిచి లోపలి విత్తనాలను తీసేయాలి. తర్వాత గుండ్రంగా చక్రాల్లాగా కోసి పక్కన పెట్టుకోవాలి.

ఓ గిన్నెలో రెండు కప్పుల పెరుగు, కప్పు బొంబాయి రవ్వ, సరిపడా ఉప్పు, కారం, ఛాట్‌మసాలా, మిరియాల పొడి, అల్లం పేస్టు, స్వీట్‌కార్న్‌, పనీర్‌ తరుగు, ఉల్లి, టమాటో, కొత్తిమీర తరుగు వేసి కలపాలి.

పెనం వేడి చేసి కొద్దిగా నూనె వేసుకోవాలి. తర్వాత దాని మీద క్యాప్సికం రింగ్స్‌ వేయాలి.

ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని ఈ రింగుల్లో పట్టినంత వేయాలి. తర్వాత పెనంపై మూతను బోర్లించాలి.

రింగులు గోధుమ రంగులోకి వచ్చాక.. రెండో వైపునకు తిప్పాలి. రెండు వైపులా ఎర్రగా కాలిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకోవాలి.

ఈ స్నాక్‌ ఆకర్షణీయంగా ఉండటంతో పాటు రుచిగానూ ఉంటుంది. ఈ వంటకానికి నూనె తక్కువగా వినియోగిస్తాం కాబట్టి ఆరోగ్యం కూడా.

సైకత శిల్పాలతో గోల్డ్‌ మెడల్‌

వర్షాకాలంలో రోడ్‌ ట్రిప్‌.. ఈ దారుల్లో అద్భుతం..

ఒత్తిడిని జయించేందుకు నిపుణుల సలహాలివే..!

Eenadu.net Home