స్పెషల్ అట్రాక్షన్ సీరత్ కపూర్
‘రన్ రాజా రన్’లో శర్వానంద్ సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సీరత్ కపూర్. ప్రస్తుతం ప్రత్యేక పాత్రలతో కుర్రకారును ఆకట్టుకుంటుంది.
ఇటీవల తన తొలి హీరో ‘మనమే’లో శర్వానంద్ సరసన ‘బూమ్ బూమ్..’ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడింది. మరోసారి ఈ జంట పాటలో కనిపించడంతో వారి ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు.
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ‘మనమే’లో నాయిక కృతిశెట్టి. ఈ సినిమా థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకుంది.
ఇక సీరత్ కపూర్ ఏమో.. ప్రత్యేక పాత్రల్లో నటిస్తూ టాలీవుడ్‌లో మళ్లీ బిజీ అవుతోంది. ఇటీవల ‘భామా కలాపం 2’లో జుబీదాగా కనిపించి అలరించింది.
డిస్నీ ప్లస్ వేదికగా విడుదలైన ‘సేవ్ ద టైగర్స్ 2’ వెబ్‌సిరీసులోనూ నటించింది. ఇందులో ప్రధాన పాత్రలకు మిత్రురాలు.. హీరోయిన్ హంసలేఖగా కనిపించి మెప్పించింది.
బాలీవుడ్‌లో 2014లో ‘జిద్’తో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ‘రన్ రాజా రన్’తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.
ఆ తర్వాత ‘టైగర్’, ‘కొలంబస్’, ‘రాజు గారి గది 2’, ‘ఒక్క క్షణం’, ‘టచ్ చేసి చూడు’, ‘కృష్ణ అండ్ హిజ్ లీల’, ‘మా వింత గాధ వినుమా’ తదితర చిత్రాలతో ఆకట్టుకుంది.
This browser does not support the video element.
సీరత్‌కి చిన్నప్పట్నుంచే డ్యాన్స్ అంటే ఇష్టం. 16వ ఏటనే బాలీవుడ్ కొరియోగ్రాఫర్ అష్లీ లోబో దగ్గర శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. కొంత కాలం అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గాను పనిచేసింది.
బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ మాస్ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీని మధ్యలో ఆపేసింది. నటనపై ఆసక్తి ఉండటంతో చదువు కంటే యాక్టింగ్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది.
ఆ తర్వాత యాక్టింగ్ స్కూల్లో చేరి శిక్షణ తీసుకుంది. మోడలింగ్‌లో అడుగుపెట్టింది. అప్పుడే సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.
This browser does not support the video element.
స్లిమ్‌గా ఉంటుంది కదా.. నోరు కట్టేసుకుంటుంది అనుకునేరు.. నచ్చిన ఆహారాన్ని లాగించేస్తుంది. బర్గర్లు, హాట్ చాక్లెట్ అంటే సీరత్‌కి మహా ఇష్టం. ఎంత తిన్నా, ఏవి తిన్నా దానికి సరిపడా జిమ్ కూడా చేస్తుంది.
ఇన్‌స్టాలో గ్లామరస్ పోజులతో యువతను కట్టిపడేస్తుంటుంది. తన ఇన్‌స్టాఖాతాకి 10 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.