శీతల్.. సింగిల్ గర్ల్..
శీతల్ గౌతమన్ ఈ పేరు వినే ఉంటారు కదా! యూట్యూబ్‌లో బాగా ఫేమస్.. టిక్ టాక్, డబ్‌స్మాష్ వీడియోలతో పాపులరై.. ఇప్పుడు నటిగా ఎదుగుతోంది.
image: instagram/sheetal.gauthaman
హైదరాబాద్‌లో 1998లో పుట్టిన శీతల్‌కు చిన్నప్పట్నుంచే డ్యాన్స్, యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనే కోరిక ఉండేది. బ్యాడ్మింటన్ ఆడటమంటే శీతల్‌కి చాలా ఇష్టమట.
image: instagram/sheetal.gauthaman
ఇంట్లో వాళ్ల కోరిక మేరకు ఇంజినీరింగ్‌లో చేరింది. కాలేజీలో కూడా కల్చరల్ యాక్టివిటీల్లో పాల్గొనేది. చదువు పూర్తవ్వక ముందే ఫ్యాషన్ డిజైనర్‌గా, మేకప్ ఆర్టిస్టుగా పనిచేసింది.
image: instagram/sheetal.gauthaman
This browser does not support the video element.
ఇంట్లో వాళ్లని ఒప్పించి యాక్టింగ్ వైపు అడుగులేసింది. డబ్‌స్మాష్ వీడియోలతో తన నటనను ప్రూవ్ చేసుకుందామనుకుంది. ఈ క్రమంలోనే టిక్ టాక్, ఇన్‌స్టా వీడియోలూ చేయడం మొదలుపెట్టింది.
image: instagram/sheetal.gauthaman
ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు టిక్‌టాక్, ఇన్‌స్టా వీడియోలు చేస్తూ సోషల్‌మీడియా స్టార్‌గా మారింది. ఈమెను చూసి షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్లు యూట్యూబ్ షార్ట్‌ఫిల్మ్స్‌లో అవకాశాలిచ్చారు.
image: instagram/sheetal.gauthaman
మొదట్లో షార్ట్‌ఫిల్మ్స్‌లో సహాయక పాత్రలు చేసింది. ఈమె నటన నచ్చి హీరోయిన్‌గా పెట్టారు. ‘సఖియా’, ‘సింగిల్ గర్ల్’, ’ఆవకాయ ఐస్‌క్రీం’, ‘మిడిల్ క్లాస్ అమ్మాయి’, ‘క్వారంటైన్ విత్ వాలెంటైన్’ వంటి వెబ్‌సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ చేసింది.
image: instagram/sheetal.gauthaman
శ్రీహాన్, మెహబూబ్ దిల్‌సే, సన్నీ, షణ్ముఖ్ జశ్వంత్ వంటి యూట్యూబర్స్‌తో కూడా ఈమె నటించింది. పృథ్వీ ముక్కాతో చేసిన ‘ఇద్దరమ్మాయిలతో’ శీతల్‌కి బాగా గుర్తింపు తెచ్చింది. ఇది కరోనా లాక్‌డౌన్ సమయంలో విడుదలైంది.
image: instagram/sheetal.gauthaman
యూట్యూబ్‌లో శీతల్ సొంతగా ఛానల్ ప్రారంభించి.. ‘వాట్ ఇఫ్ యువర్ ఎక్స్ ఈజ్ యువర్ బాస్’ అనే షార్ట్ ఫిల్మ్ అప్‌లోడ్ చేసింది. దీనికి చాలా వేగంగా 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సైమా షార్ట్ ఫిలిమ్ ఆఫ్ 2020 అవార్డునూ గెలుచుకుంది.
image: instagram/sheetal.gauthaman
ఇంతకు ముందు తన వెబ్‌సిరీస్ మొత్తానికి ఒక మిలియన్ వ్యూస్ వచ్చేవి. కానీ ‘కుందనపు బొమ్మ’ వెబ్‌సిరీస్ ప్రతి వీడియోకి ఒక మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. యూట్యూబ్‌లో ఈమె ఛానల్‌కి ప్రస్తుతం 3.5 లక్షల మంది సబ్‌స్ర్కయిబర్లున్నారు.
image: instagram/sheetal.gauthaman
ఈ మధ్యే‘మోర్ దేన్ ఫ్రెండ్స్’వెబ్ సిరీస్‌తో మెప్పించిన శీతల్.. ప్రస్తుతం ‘రెసిపీ’వెబ్‌సిరీస్‌లో నటిస్తూ బిజీగా ఉంది.
image: instagram/sheetal.gauthaman