సెలెనా గోమెజ్... పెళ్లి వార్తతో వైరల్
అమెరికన్ సింగర్, నటి సెలెనా గోమెజ్ తన ప్రియుడు బెన్నీ బాన్కోతో నిశ్చితార్థం చేసుకుంది.
సెలెనా గతేడాది డిసెంబర్‌లో గీత రచయిత బెన్నీ బాన్కోతో ప్రేమలో ఉన్నట్టు తెలిపింది.
1992లో టెక్సాస్‌లో పుట్టిన సెలెనా 2002లో ‘బార్నీ అండ్ ఫ్రెండ్స్’ అనే టెలివిజన్ సిరీస్‌తో కెరీర్‌ను మొదలుపెట్టింది.
చిన్నప్పట్నుంచే స్టేజీపై ప్రదర్శనలు ఇవ్వడంతో.. నటన, గానంపై ఆసక్తి పెరుగుతూ వచ్చింది.
పాటలు పాడటం, డ్యాన్స్ చేయడంతో టీనేజ్ వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.
కొంత కాలానికే పాప్ సింగర్‌గా పేరు పొందింది. 2008లో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. ప్రస్తుతం 3కోట్ల 40లక్షలకు పైగా సబ్‌స్ర్కయిబర్లు ఉన్నారు.
సెలెనా ఆర్టిస్ట్ మాత్రమే కాదు.. చెఫ్ కూడా! కుకింగ్ షోస్‌లో పాల్గొని టేస్టీగా రెసిపీలను తయారు చేస్తుంది.
‘గో విత్ ద ఫ్లో..’ అన్నట్టు నచ్చింది చేసే సెలెనా.. ‘పరిస్థితులు ఎలా ఉన్నా.. ఆ సమయంలో గొంతు వణుకుతున్నా.. మెదడు చెప్పేదే వినండి’ అని అంటోంది.
పలు ప్రముఖ సౌందర్య ఉత్పత్తుల ప్రకటనల్లో నటిస్తోంది. మ్యాగజీన్ల కవర్ ఫొటోలకూ పోజులు ఇస్తుంటుంది.
ఇన్‌స్టాలో ఈమె ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. 42.3 కోట్ల మంది ఫాలో అవుతున్నారు.