సెన్సెక్స్ @ 80K.. కీలక మైలురాళ్లు ఇవే..
సెన్సెక్స్ తొలిసారి జులై 3న ఇంట్రాడేలో 80 వేల మార్కును నమోదు చేసింది. సెన్సెక్స్ చరిత్రలో ఇంట్రాడేలో ఏ మైలురాయిని ఎప్పుడు అందుకుందో ఇప్పుడు చూద్దాం..
5,000 పాయింట్లు
1999 అక్టోబర్ 8న తొలిసారి సెన్సెక్స్ 5 వేల మైలురాయిని చేరుకుంది. ఇది అందుకోవడానికి సెన్సెక్స్‌కు 4,357 రోజుల సమయం పట్టింది.
10,000 పాయింట్లు
సెన్సెక్స్ 2006 ఫిబ్రవరి 6న 10 వేల గరిష్ఠాన్ని తాకింది. ఇందుకోసం 1588 రోజుల సమయం తీసుకుంది.
20,000 పాయింట్లు
2007 జులై 6న 15వేల మార్కును దాటిన బీఎస్‌ఈ సెన్సెక్స్.. అదే ఏడాది అక్టోబర్ 29న మరో 5వేలు ఎగబాకి 20 వేల పాయింట్లను తాకింది.
30,000 పాయింట్లు
2014 మే 16న 25 వేల మార్కు తాకిన సూచీ.. 2015 మార్చి 4న 30వేల మైలురాయిని అందుకుంది.
40,000 పాయింట్లు
2018లో జనవరి 17న 35వేలు దాటిన సెన్సెక్స్.. 2019 మే 23న తొలిసారి 40వేల మార్కును తాకింది.
50,000 పాయింట్లు
2021 జనవరి 21న సెన్సెక్స్ సరికొత్త రికార్డును నమోదు చేసింది. 45వేల నుంచి 50 వేల పాయింట్లు అందుకోవడానికి కేవలం 33 రోజులే పట్టింది.
60,000 పాయింట్లు
2021 సెప్టెంబర్ 24న 60 వేల పాయింట్లను నమోదు చేసింది. కొవిడ్ తర్వాత నమోదైన అత్యుత్తమ గణాంకాలు ఇవీ..
70,000 పాయింట్లు
2023 డిసెంబర్ 11న సెన్సెక్స్ తొలిసారి 70 వేల పాయింట్లను తాకింది.
80,000 పాయింట్లు
2024 ఏప్రిల్ 9న 75 వేల మార్కును తాకిన సూచీ.. 2024 జులై 3న తొలిసారి 80 వేల పాయింట్లను తాకింది. 57 రోజుల్లోనే 5 వేల పాయింట్లు పెరిగింది.