టీ20 ప్రపంచకప్: సంచలనాలు సృష్టిస్తోన్న చిన్నజట్లు
ఈ టీ20 ప్రపంచకప్‌లో ఆశ్చర్యపర్చే విజయాలు నమోదవుతున్నాయి. గతంలో ఛాంపియన్‌గా నిలిచిన పెద్ద జట్లను పసికూనలు ఓడిస్తున్నాయి. మరి ఆ జట్లేవో ఓ సారి తెలుసుకుందాం.
Image: Twitter
SA X NED
తాజాగా టీ20 ప్రపంచకప్ గ్రూప్ 2లోని నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా అడిలైడ్ వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్ 13 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో దక్షిణాఫ్రికా సెమీస్‌కు చేరుకోలేకపోయింది.
Image: Twitter
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ నిర్ణీత ఓవర్లలో 158/4 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా బ్యాటర్లను ‘పసికూన’ బౌలర్లు సమర్థంగా నిలువరించారు. దీంతో దక్షిణాఫ్రికా 8 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Image: Twitter
SL X NAM
ఈ టీ20 ప్రపంచకప్‌లో మొదటి సంచలనం శ్రీలంక, నమీబియా మధ్య సూపర్ 12లో చోటు కోసం జరిగిన అర్హత మ్యాచ్‌లో నమోదైంది.
Image: Twitter
మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా 20 నిర్ణీత ఓవర్లలో 163/7 స్కోరు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక.. నమీబియా బౌలర్ల ధాటికి 19 ఓవర్లలో 108 పరుగులే చేసి ఆలౌటైంది.
Image: Twitter
WI X SCO
రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్‌కు అర్హత మ్యాచ్‌లో స్కాట్లాండ్ భారీ షాక్ ఇచ్చింది. మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 160/5 స్కోరు చేయగా.. విండీస్ 18.3 ఓవర్లలో 118 పరుగులే చేసి చేతులేత్తేసింది.
Image: Twitter
ENG X IRE
సూపర్ 12లో ఇంగ్లాండ్‌ను ఓడించి ఐర్లాండ్ సంచలనం సృష్టించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 19.2 ఓవర్లకు 157 పరుగులకు ఆలౌట్ కాగా.. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 14.3 ఓవర్లకు 105/5 స్కోర్ చేసింది.
Image: Twitter
మ్యాచ్ మధ్యలో వర్షం కురవడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 5 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై ఐర్లాండ్ గెలిచినట్లు అంపైర్లు ప్రకటించారు.
Image: Twitter
PAK X ZIM
భారత్ చేతిలో ఓడిన పాక్‌కు జింబాబ్వే చేతిలోనూ భంగపాటు తప్పలేదు. ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించి సంచలనం సృష్టించింది.
Image: Twitter
WI X IRE
పసికూన ఐర్లాండ్‌పై కూడా కరేబియన్ జట్టు సత్తా చాటలేకపోయింది. సూపర్ 12 కోసం జరిగిన అర్హత పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 146/5 స్కోరు చేయగా.. ఈ లక్ష్యాన్ని ఐర్లాండ్ ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 17.3 ఓవర్లలో ఛేదించేసింది.
Image: Twitter